High Blood Pressure: హై బ్లడ్ ప్రెషర్ సమస్యతో బాధపడే వారు తినే ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే వారు ఏ ఆహారం తీసుకున్న దాని ప్రభావం రక్తపోటుపై పడుతుంది. హైపర్ టెన్షన్ సమస్యతో బాధ పడే వారు.. బీపీ ని నియంత్రణలో ఉంచుకోవడం ఎంతో అవసరం. నిరంతరం హై బ్లడ్ ప్రెషర్ సమస్య ఉన్నవారు హార్ట్ స్ట్రోక్ మరియు గుండె పోటు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. అధిక రక్తపోటుని పెంచే కొన్ని ఆహారాలు పదార్థాలు ఉన్నాయి.. వీటిని తినటం వలన రక్తపోటు పెరుగుతుంది. కావున వీటికి దూరంగా ఉండటం చాలా మంచిది.
చక్కెర..
పంచదారతో చేసే పదార్ధాలను తినడం వల్ల బ్లడ్ షుగర్ తో పాటు.. రక్తపోటు కూడా పెరుగుతుంది. ఎందుకంటే చక్కెరని పదార్థాలను తినడం వలన బరువు పెరుగుతారు. బరువు కనుక పెరిగితే దీంతో పాటు అనేక వ్యాధులకు గురయ్యే ప్రమాదం కూడా పెరుగుతుంది. కావున అధిక రక్తపోటు సమస్య కలవారు చక్కెరను నియమిత పరిమాణంలో తినడం మంచిది.
ఉప్పు..
అధిక రక్తపోటు మరియు గుండె జబ్బులు గురవటానికి కారణం.. ఎక్కువగా ఉప్పు తీసుకోవటం. హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవారిని ఉప్పు తక్కువగా తినమని వైద్యులు సలహా ఇస్తుంటారు. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు ఉప్పుని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. కావున హై బీపీ కలవారు ఇంట్లో ఉప్పు తక్కువగా వేసి చేసిన ఆహారాన్ని తినడం మంచిది. పిజ్జా,బర్గర్ మొదలైన ఆహారాలకి దూరంగా ఉండడం చాలా మంచిది.
మాంసం..
ప్రాసెస్ చేసిన మాంసాన్ని తినడం వల్ల కూడా రక్తపోటు పెరుగుతుంది. కావున, దీనికి పూర్తిగా దూరంగా ఉండడం మంచిది. అంతేకాకుండా శాండ్‌విచ్‌లు,పచ్చళ్ళు మరియు మాంసం వంటి ఉప్పు ఎక్కువగా ఉండే వాటిని హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు ఆహారంలో చేర్చకూడదు. ఈ విధంగా చేయడం వల్ల రక్తపోటుని నియంత్రించవచ్చు.
Also Read: Poco F5 Pro Price: బిగ్‌బిలియన్ డేస్ సేల్‌లో POCO F5 5G మొబైల్‌పై రూ. 15,050 తగ్గింపు, త్వరపడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook