Chandrababu Case: సీఐడీ కస్టడీనా, రిమాండ్ పొడిగింపా..ఇవాళ ఏం జరగనుంది

Chandrababu Case: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్టయిన చంద్రబాబు కేసులో ఇవాళ అత్యంత కీలకం కానుంది. క్వాష్ పిటీషన్ వర్సెస్ సీఐడీ కస్టడీ నేపధ్యంలో ఏం జరుగుతుందోననే ఆసక్తి మొదలైంది. పూర్తి వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 22, 2023, 06:47 AM IST
Chandrababu Case: సీఐడీ కస్టడీనా, రిమాండ్ పొడిగింపా..ఇవాళ ఏం జరగనుంది

Chandrababu Case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు కష్టాలు తప్పేట్టు లేవు. ఏం లేదు..బయటికొచ్చేస్తారనే ధీమా పోతోంది. ఒకదానివెంట మరొకటిగా కేసులు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ అటు ఏపీ హైకోర్టు, ఇటు ఏసీబీ కోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడిని కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటీషన్‌పై ఏసీబీ కోర్టు తీర్పు వాయిదా వేసింది. నిన్న రావల్సిన తీర్పు కాస్తా..ఇవాళ అంటే శుక్రవారానికి వాయిదా పడింది. ఎందుకంటే ఇదే కేసును కొట్టి వేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో దాఖలైన పిటీషన్‌పై ఇప్పటికే విచారణ పూర్తయింది. ఈ కేసులో ఇవాళ తీర్పు వెలువడవచ్చని ఆశిస్తున్నారు. హైకోర్టు క్వాష్ పిటీషన్ రద్దు చేస్తే ఇక ఏసీబీ కోర్టులో సీఐడీ కస్టడీ పక్కకుపోతుంది. అందుకే ఏసీబీ కోర్టు తీర్పును ఇవాళ్టి వరకూ వాయిదా వేసింది. అయితే హైకోర్టులో ఇవాళ్టి కేసుల జాబితాలో చంద్రబాబు కేసు లేకపోవడంతో హైకోర్టు తీర్పు ఇంకా ఆలస్యం కావచ్చని కూడా సమాచారం అందుతోంది. ఈ నేపధ్యంలో చంద్రబాబును కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటీషన్‌పై వాదనలు పూర్తి చేసిన ఏసీబీ కోర్టు ఇవాళ తీర్పు వెలవరించవచ్చు.

మరోవైపు స్కిల్ కేసులో చంద్రబాబుకు విధించిన రిమాండ్ ఇవాళ్టితో పూర్తవుతోంది. ఈ క్రమంలో ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఒకవేళ హైకోర్టు రిమాండ్ రద్దు చేస్తే మాత్రం చంద్రబాబుకు ఈ కేసు నుంచి ఊరట లభిస్తుంది. ఇతర కేసులు వెంటాడవచ్చు. హైకోర్టు తీర్పు రాకపోతే మాత్రం కస్టడీపై తీర్పును ఏసీబీ కోర్టు వెలువరించాల్సి ఉంటుంది. 

అంటే చంద్రబాబు కేసులో ఇవాళ మూడు కీలక పరిణామాల్లో ఏదో ఒకటి కచ్చితంగా జరగనుంది. ఏపీ హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై తీర్పు రావడం లేదా సీఐడీ కస్టడీపై ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించడం లేదా చంద్రబాబు రిమాండ్ పొడిగించడం. ఈ మూడింటిలో ఒకటి అనివార్యం కానుంది. 

Also read: AP Skill Case: చంద్రబాబు చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు, తెరపై సీబీఐ దర్యాప్తు, రిమాండ్ పెరగనుందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News