APPSC Group 1 Results: ఏపీపీఎస్‌సి నోటిఫికేషన్‌లో భాగంగా 110 పోస్టుల భర్తీకై నిర్వహించిన గ్రూప్ 1 తుది ఫలితాలు వచ్చేశాయి. తుది పరీక్ష అనంతరం ఎంపికైన అభ్యర్ధుల వివరాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అదికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/లో పొందుపరిచారు.
ఇవాళ విడుదలైన గ్రూప్ 1 తుది ఫలితాలకు సంబంధించి జూన్ 3 నుంచి 10 వరకూ మెయిన్స్ పరీక్ష జరగగా, ఆగస్టు 2 నుంచి 11 వరకూ ఇంటర్వ్యూలు జరిగాయి. ఈ రెండు దశల అనంతరం ఎంపికైన వారి ఫలితాలను ఏపీపీఎస్‌సి ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ విడుదల చేశారు. ఎంపికైన వారి ఫలితాలు అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/లో ఉన్నాయి. నోటిఫికేషన్ వెలుడినప్పటి నుంచి ఇంటర్వ్యూ వరకూ పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించినట్టు గౌతమ్ సవాంగ్ చెప్పారు. అదే సమయంలో అతి తక్కువ సమయంలో ఏ వివాదం లేకుండా ఏపీపీఎస్ సి గ్రూప్ 1 ప్రక్రియను పూర్తి చేయడం విశేషం.
మొత్తం 111 పోస్టులకు 110 పోస్టుల ఫలితాల్ని వెల్లడించామని, మిగిలిన మరో పోస్టును స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తామని ఏపీపీఎస్‌సి ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ చెప్పారు. ఇంటర్వ్యూ ప్రక్రియను కూడా ఒక్కొక్క పోస్టుకు ఇద్దరి చొప్పున జరిగిందన్నారు. మొత్తం ఎంపిక ప్రక్రియను ఏ వివాదం లేకుండా కేవలం 11 నెలల అతి తక్కువ సమయంలో పూర్తి చేశామన్నారు. ఇంటర్వ్యూకు వచ్చినవారిలో ముగ్గురు ఐఐఎం, 15 మంది ఐఐటీ అభ్యర్ధులు ఉన్నారు. ఇక ఎంపికైనవారిలో మొదటి పది స్థానాల్లో ఆరుగురు మహిళలే కావడం విశేషం. అంతేకాదు..టాప్ 3 ర్యాంకులు మహిళలకే వచ్చాయి.
ఏపీపీఎస్‌సి నోటిఫికేషన్ 2022 సెప్టెటంబర్ 30న 111 పోస్టులకు వెలువడింది. 2023 జనవరి 8న ప్రిలిమినరీ పరీక్ష జరగగా, జనవరి 27న ఫలితాలు వెల్లడయ్యాయి. ప్రిలిమినరీ నుంచి మెయిన్స్ పరీక్షకు 6,455 మంది అర్హత సాధించారు. జూన్ 3 నుంచి 10 వరకూ మెయిన్స్ పరీక్షలు జరిగాయి. మొత్తం 110 పోస్టులకు 220 మంది అర్హత సాధించగా ఆగస్టు 2 నుంచి 11 వరకూ తుది ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఏపీపీఎస్‌సి గ్రూప్ 1 ఫలితాల్లో ఢిల్లీ యూనివర్శిటీలో బీఏ ఎకనామిక్స్ చేసిన భూనుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష ఫస్ట్ ర్యాంకర్‌గా నిలవగా, అనంతపురంకు చెందిన భూమిరెడ్డి భవాని సెకండ్ ర్యాంక్ సాధించారు. ఇక కంబాలకుంట లక్ష్మీ ప్రసన్న మూడో ర్యాంక్ సాధించారు.
Also read: CH Krishnarao Death: సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు కన్నుమూత, సీఎం జగన్, కేసీఆర్‌ల సంతాపం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook