AP Government: ఉద్యోగుల పీఆర్సీ, ఫిట్మెంట్ వంటి సమస్యలపై ఏపీ విద్యుత్ ఉద్యోగులు సమ్మెను ఉద్యోగులు ఉపసంహరించుకున్నారు. ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలం కావడంతో ఉద్యోగులు సమ్మె విరమించారు. కానీ అర్ధరాత్రి వేళ విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజానీకం చాలా ఇబ్బంది పడింది.
ఏపీలో విద్యుత్ ఉద్యోగులు ప్రజల ఇబ్బందులతో ఆడుకున్నారు. అర్ధరాత్రి వేళ సమ్మె నోటుసులిచ్చి..విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో జనం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజలకు కనీస సమాచారం లేకుండా ఫోన్ కూడా స్విచాఫ్ చేసుకున్నారు. 15 శాతం ఫిట్మెంట్, పీఆర్సీ డిమాండ్లు పెట్టగా ప్రభుత్వం ఉద్యోగులతో చర్చలు జరిపి ఫిట్ మెంట్ 8 శాతానికి ఒప్పంచింది. దాంతోపాటు 2.60 లక్షలు మాస్టర్ స్కేలు ఇచ్చేందుకు అంగీకారమైంది. చర్చలు సఫలం కావడంతో సమ్మె నోటీసులు ఉపసంహరించుకున్నారు.
వాస్తవానికి చర్చల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో సంతృప్తిగా లేమని..కానీ ప్రజలకు ఆటంకం కల్గించకూడదనే ఉద్దేశ్యంతో ఒప్పుకున్నామని ఉద్యోగ జేఏసీ తెలిపింది. విద్యుత్ ఉద్యోగులతో చర్చలు సఫలమయ్యాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా స్పష్టం చేశారు. సమ్మె విరమించినందున వెంటనే విధులకు హాజరు కావాలని మంత్రి సూచించారు. చర్చల్లో అంగీకారం లభించిన అంశాలపై ఎల్లుండి ఒప్పందాలు జరుగుతాయన్నారు.
Also read: Ap Government: ఆర్ 5 జోన్‌పై న్యాయ పోరాటానికి సిద్ధమైన ప్రభుత్వం, సుప్రీంలో పిటీషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook