Group-2 Exam: ముందుగా ప్రకటించిన తేదీల్లోనే గ్రూప్-2 పరీక్ష.. క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్..

Group-2 Exam: గ్రూప్-2 పరీక్షను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ పరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పకడ్భందీగా చేయాలని ముఖ్యమంత్రి అధికారలను ఆదేశించారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 7, 2023, 08:22 AM IST
Group-2 Exam: ముందుగా ప్రకటించిన తేదీల్లోనే గ్రూప్-2 పరీక్ష.. క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్..

TSPSC Group-2 Exam: ఈ నెల 29, 30 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కొందరు కోరుతున్న నేపథ్యంలో అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్(CM KCR) స్పష్టత నిచ్చారు. గ్రూప్-2 పరీక్ష షెడ్యూల్ ప్రకారమే యథావిథిగా జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో గ్రూప్‌-2 కింద 783 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్‌ 29న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 

రీసెంట్ గా గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కొందరు టీఎస్‌పీఎస్సీని ఆశ్రయించగా.. మరికొందరు షెడ్యూల్ ప్రకారమే పరీక్ష నిర్వహించాలని కమిషన్ ను కోరారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొన్ని నెలల కిందటే ఎగ్జామ్ డేట్ ను ప్రకటించింది. అంతేకాకుండా ఈ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. పరీక్ష నిర్వహణ, కేంద్రాలు తదితర అంశాలపై టీఎస్‌పీఎస్సీ ఇదివరకే కలెక్టర్లు, పోలీస్‌ ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించింది. గ్రూప్ 2 పరీక్షను నిర్వహించబోతున్న సెంటర్లకు 28, 29 తేదీల్లో విద్యాశాఖ సెలవు ప్రకటించింది. 

ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు సభ్యులు సైతం గ్రూప్-2 వాయిదా వేయాలని కోరారు. ఈ క్రమంలోనే సీఎస్‌ శాంతికుమారితో సీఎం కేసీఆర్‌ చర్చలు జరిపారు. అన్నీ పరిశీలించిన తర్వాత గ్రూప్‌-2 పరీక్ష యథావిధిగా కొనసాగుతుందని సీఎం ప్రకటించారు. పరీక్షకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని.. మిగిలిన పరీక్షల నిర్వహణపై మరోసారి అధికారులతో చర్చించాలని సీఎస్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

Also read: Telangana: వైఎస్ఆర్, జగన్‌లపై ప్రశంసల వెనుక కేసీఆర్ వ్యూహమిదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News