Ys Jagan Review: ఏపీలో గత 3-4 రోజుల్నించి భారీ వర్షాలు పడుతున్నాయి. మరోవైపు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి వరద ఉధృతితో పోటెత్తుతోంది. గోదావరి వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకుని సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలో ఓ వైపు భారీ వర్షాలు మరోవైపు గోదావరి వరద తాకిడి సమస్యగా మారాయి. సాధారణంగా గోదావరికి వరద ఉన్నప్పుడు స్థానికంగా వర్షాలుండవు. కానీ ఈసారి భారీ వర్షాలు, గోదావరి వరద ఒకేసారి ఏకకాలంగా ఇబ్బంది పెడుతున్నాయి. దాంతో అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారు. ఇవాళ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలోని వరదలు వర్షాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ ముంపు బాదితులకు అండగా నిలవాలని సీఎం జగన్ ఆదేశించారు.
ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై సమీక్షించారు. ఈ జిల్లాల్లో పరిస్థితిని అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు. మొత్తం వరద బాధిత 42 మండలాల్లోని 458 గ్రామాల్ని అప్రమత్తం చేసినట్టు అధికారులు వివరించారు. సహాయక చర్యల నిమిత్తం ఇప్పటికే 3 ఎన్డీఆర్ఎప్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్దంగా ఉన్నాయి. ముంపు బాధితులకు ఆసరాగా ఉండి సహాయక చర్యలకు సదా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ముంపు బాధితులకు సౌకర్యాలు కల్పించే విషంయలో లోటు రానివ్వకూడదన్నారు.
ఇప్పటికే చాలావరకూ లోతట్టు ప్రాంత ప్రజల్ని సహాయక శిబిరాలకు తరలించామని మందులు సహా అత్యవసరమైన అన్ని వస్తువుల్ని సిద్ధంగా ఉంచామని అధికారులు తెలిపారు. కోనసీమ జిల్లాల్లో సహాయక చర్యల నిమిత్తం లంక గ్రామాల్లో ప్రజల్ని తరలించేందుకు 150 పడవలు సిద్ధం చేశారు. సహాయక చర్యల విషయంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వాలంటీర్ల సేవల్ని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. అదే సమయంలో సహాయక చర్యల కోసం ముందస్తు నిదుల్ని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
Also read: Godavari Floods: ఉగ్రరూపంతో గోదావరి, ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook