Inorbit Mall: ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖపట్నంలో ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్ సమ్మిట్ 2023 ఒప్పందాలు ఒక్కొక్కటిగా కార్యరూపం దాలుస్తున్నాయి. 600 కోట్ల ఖర్చుతో రహేజా గ్రూప్ భారీ షాపింగ్ మాల్ నిర్మించేందుకుAls ముందుకొచ్చింది. పూర్తి వరాలు ఇలా ఉన్నాయి.
ఏపీలో ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఆశించిన ఫలితాలనిచ్చింది. భారీ ప్రాజెక్టులకు ఒప్పందాలు జరిగాయి. ఆ ఒప్పందాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా కార్యరూపం దాలుస్తున్నాయి. ఇప్పటికే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులకు, 14,500 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న అదానీ డేటా సెంటర్‌కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా శంకుస్థాపనం జరిగింది. ఇప్పుడు మరో భారీ ప్రాజెక్టు రానుంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త కే రహేజా గ్రూప్ అతిపెద్ద షాపింగ్ మాల్‌ను విశాఖపట్నంలో 17 ఎకరాల విస్తీర్ణంలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనుంది. ఇప్పటికే ప్రాధమిక ఒప్పందాల్ని పూర్తి చేసుకుని త్వరలో పనులు మొదలు పెట్టనుంది.
విశాఖపట్నంలోని సాలిగ్రామపురంలో ఉన్న విశాఖ పోర్ట్ ట్రస్ట్‌కు చెందిన గెస్ట్ హౌస్ స్థలంలో ఈ షాపింగ్ మాల్ నిర్మాణం జరగనుంది. ప్రస్తుతం నిర్వహణలో లేని శిధిలావస్థకు చేరుకున్న పోర్ట్ గెస్ట్ హౌస్ స్థలాన్ని విశాఖపట్నం పోర్ట్ నుంచి 30 సంవత్సరాలకు లీజుకు తీసుకుంది కే రహేజా గ్రూప్. మూడేళ్ల వ్యవధిలో కే రహాజే గ్రూప్ భారీ ఎత్తున ఇనార్బిట్ మాల్ నిర్మించనుంది. ఇప్పటి వరకూ ఇనార్బిట్ మాల్స్ దేశంలో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, మలద్, వసై, నవీ మంబై ప్రాంతాల్లో ఉంది. ఇప్పుడు త్వరలో విశాఖపట్నంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణం జరగనుంది.
ఈ సందర్బంగానే కే రహేజా గ్రూప్ అధినేత నీల్ రహేజా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి మాల్ శంకుస్థాపనకు ఆహ్వానించారు. ఇనార్బిట్ మాల్ కాకుండా త్వరలో కే రహేజా గ్రూప్ మరిన్ని పెట్టుబడులు పెట్టనుంది.
Also read: Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, మరో 4 రోజులు భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook