Diabetic Patients Diet Plan: ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య విచ్చలవిడిగా పెరుగుతుంది. ముఖ్యంగా భారతదేశ విషయానికొస్తే ప్రతి 100 మందిలో 60 నుంచి 65 మంది మధుమేహం బారిన పడుతున్నారని ఇటీవలే పరిశోధనలు తెలిపాయి. ముఖ్యంగా ఆధునిక జీవనశైలి పాటించడం వల్ల 25 సంవత్సరాల లోపు వారు కూడా ఈ మధుమేహం వ్యాధి బారిన పడుతున్నారు. అయితే మధుమేహంతో బాధపడే చాలామందిలో ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికే తీవ్రమదమేహంతో బాధపడుతున్న వారు పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
తీవ్ర మధుమేహంతో బాధపడుతున్న వారు ప్రతిరోజూ తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే రక్తంలోని చక్కెర పరిమాణాలు ఒక్కసారిగా పెరిగిపోయి ప్రాణానికి ముప్పని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా చాలామంది మధుమేహంతో బాధపడుతున్న వారు బయట లభించే స్ట్రీట్ ఫుడ్ ను అతిగా తీసుకుంటున్నారు. ఇలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా రక్తపోటుతో పాటు గుండెపోటు బారిన పడే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
తరచుగా రక్తంలోని చక్కర పరిమాణాలు పెరిగితే తప్పకుండా ఆయుర్వేద చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. తీవ్ర మధుమేహం నుంచి ఉపశమనం పొందడానికి ఎండు కాకరకాయ పొడి ప్రభావంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించడమే కాకుండా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా శరీరాన్ని కాపాడతాయి. అంతేకాకుండా జీర్ణ క్రియ సమస్యలను తగ్గించేందుకు కూడా ఈ పొడి ఎంతగానో ఉపయోగపడుతుంది.
కాకరకాయ పొడి తయారీ విధానం:
✾ ఈ పొడిని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు కాకరకాయ ముక్కలను కోసి పక్కన పెట్టుకోవాలి.
✾ ఆ తర్వాత ఈ ముక్కలను బాగా కడిగి ఎండలో ఎండబెట్టాలి.
✾ ఇలా ఎండబెట్టిన తర్వాత కాకరకాయ ముక్కలు బాగా ఎండిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి.
✾ పక్కన పెట్టుకున్న ముక్కలను మిక్సీలో గ్రైండ్ చేసి ఓ సీసాలో భద్రపరుచుకోవాలి.
✾ ఇలా భద్రపరచుకున్న పొడిని గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగితే సులభంగా మధుమేహం నుంచి ఉపశమనం లభిస్తుంది.
Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Diabetes: మధుమేహాన్ని తగ్గించే అద్భుతమైన పొడి ఇదే..రోజు ఒక టీ స్పూన్ తీసుకుంటే చాలు