Tomato Price today: టమాటాల ధర ఇప్పట్లో దిగేలా లేదు. రోజురోజూకు ధర అమాంతం పెరిగిపోతుంది. చండీగఢ్ మార్కెట్లో టమాటా ధర ఆకాశాన్నంటుతుంది. అక్కడ కిలో రూ.200 నుంచి 250 వరకు పలుకుతోంది. అదే రిటైల్ దుకాణాల్లో టమాటాలను ఏకంగా రూ. 300 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారు. అదే మార్కెట్లో తక్కువ నాణ్యత గల టమాటాలను రూ. 100 నుంచి 150 వరకు అమ్ముతున్నారు. టమాటా ధరలను చూసి సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలే ధరలు పెరుగుదలకు కారణమని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు.
ముఖ్యంగా చండీగఢ్ కు పంజాబ్, హర్యానా, హిమచల్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచే కూరగాయలు వస్తుంటాయి. అయితే టమాటా, ఉల్లి నాశిక్ నుంచి వస్తాయి. కానీ నిరంతరం వర్షాలు కురవడం వల్ల వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. తద్వారా రవాణా నిలిచిపోయింది. గత కొన్ని రోజులుగా ఉత్తారాది వర్షాలతో అల్లకల్లోలం అవుతుంది. నదులు, వాగులు పొంగిపోర్లుతున్నాయి. చాలా వరకు రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. పంటలన్నీ నాశనమయ్యాయి. ప్రస్తుతం హర్యానా నుంచి కాకరకాయ, ఓక్రా, పచ్చిమిర్చి మాత్రమే చండీగఢ్ కు వస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి టమాటా సరఫరా పూర్తి నిలిచిపోయినప్పటికీ.. సోలన్ జిల్లా నుంచి మాత్రం సరఫరా అవుతున్నాయని విక్రయదారులు చెబుతున్నారు.
జూన్ నెలలో కిలో టమాటా రూ. 40 ఉండగా.. ఇప్పుడు అది రూ.300కు చేరడం సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. టమాటాతో పాటు నెమ్మదిగా ఉల్లి ధర కూడా పెరుగుతుంది. ఉల్లి కూడా రూ.100 చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే మార్కెట్లో మిర్చి, అల్లం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మరోపక్క టమాటాల దొంగతనాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇటీవల బెంగళూరులో ఏకంగా 2 టన్నుల టమాటాలను దుండగులు దోచుకుపోయారు.
Also Read: Onion Price: టమాటాకే కాదు ఉల్లి గడ్డలకు కూడా దొంగలు రాబోతున్నారు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి