Uniform Civil Code: మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో యూనియన్ సివిల్ కోడ్ ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో సివిల్ కోడ్‌పై దేశంలో చర్చ రేగుతోంది. తాజాగా కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్ సివిల్ కోడ్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టాలని చూస్తున్న యూనిఫాం సివిల్ కోడ్‌పై కేంద్ర మాజీ మంత్రి, మాజీ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ కేంద్రాన్ని హెచ్చరించారు. యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేయడమనేది ఆర్టికల్ 370 రద్దు చేసినంత సులభం కాదని స్పష్టం చేశారు. యూనిఫాం సినిల్ కోడ్ వ్యవహారంలో అన్ని మతాలు వస్తాయని, క్రిస్టియన్లు, సిక్కులు, గిరిజనులు, జైనులు, పార్శీలు వస్తారని తెలిపారు అన్ని మతాలు, వర్గాల్ని విసిగిస్తే ఏ ప్రభుత్వానికీ మంచిది కాదని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ ఛైర్మన్ గులాం నబీ ఆజాద్ హితవు పలికారు. యూనిఫాం సివిల్ కోడ్ అనేది మతం ఆధారంగా పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత వంటి విషయాలకు సంబంధించినది. అందుకే ఈ చర్యలకు పాల్పడవద్దని ప్రభుత్వానికి సూచిస్తున్నానన్నారు.
మరోవైపు జమ్ము కాశ్మీర్లో భూమి-భూమి విధానాన్ని గులాం నబీ ఆజాద్ స్వాగతించారు. భూమి ఇవ్వాలనే షరతును స్వాగతిస్తున్నామని కానీ ఆ భూమిని జమ్ముకశ్మీర్‌లోని పేదలకు మాత్రమే ఇవ్వాలని ఆజాద్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికొచ్చిన కొద్దికాలానికి సొంతంగా పార్టీ స్థాపించిన గులాం నబీ ఆజాద్ త్వరలో జరగాల్సిన ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నానన్నారు. సివిల్ కోడ్ వ్యవహారంతో పాటు మహారాష్ట్ర రాజకీయాలు, ఎన్సీపీలో ఏర్పడిన సంక్షోభంపై స్పందించారు. శరద్ పవార్‌పై చాలా గౌరవముందని, అతని పార్టీ బలంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. విబేధాలు ఆా పార్టీ అంతర్గత సమస్య అని గులాం నబీ ఆజాద్ చెప్పారు.
Also read: Honey Trap Case: హనీ ట్రాప్‌లో డీఆర్డీవో సైంటిస్టు, దేశ రహస్యాలు పాకిస్తాన్‌కు చేరవేత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook