/telugu/photo-gallery/bsnl-new-cheapest-recharge-plan-that-tempts-jio-airtel-users-84-days-offer-with-3gb-daily-data-extra-rn-180889 BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. 180889

HDFC Bank Hikes MCLR: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్. ఈ బ్యాంక్‌లో లోన్లు తీసుకున్నవారి ఈఎంఐ మరింత పెరగనుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ల బెంచ్‌మార్క్ మార్జినల్ కాస్ట్ (ఎంసీఎల్‌ఆర్)ని ఎంపిక చేసిన కాల వ్యవధిలో 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. కొత్త రేట్లు శుక్రవారం (జూలై 7) నుంచి అమలులోకి వచ్చినట్లు బ్యాంక్ తెలిపింది. తాజా ఎంసీఎల్ఆర్ పెంపు హోమ్ లోన్స్‌పై ప్రభావం చూపదు. ఎంసీఎల్ఆర్‌తో అనుసంధానమైన ఓల్డ్ పర్సనల్ లోన్లు, వెహికల్ లోన్స్ తీసుకునేవారు (ఫ్లోటింగ్ రేటు రుణాలు)పై ప్రభావం చూపనుంది. డిపాజిట్ రేట్లు, రెపో రేట్లు, నిర్వహణ ఖర్చులు, క్యాష్ మెయింటెనెన్స్ ఖర్చులు వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు హెచ్‌డీఎఫ్‌ఎసీ బ్యాంక్ వెల్లడించింది. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 8.10 శాతం నుంచి 8.25 శాతానికి చేరింది. అంటే 15 బేసిస్ పాయింట్లు పెరిగింది. ఒక నెల ఎంసీఎల్ఆర్ 10 పాయింట్లు పెరిగి 8.20 శాతం నుంచి 8.30 శాతానికి చేరుకుంది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ కూడా 8.50 శాతం నుంచి 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.60 శాతానికి చేరింది. అయితే ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 5 బేసిస్ పాయింట్లు పెరిగింది. 8.85 శాతం నుంచి 8.90 శాతానికి చేరుకుంది. అయితే ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు ఉండే ఎంసీఎల్ఆర్‌లలో ఎలాంటి మార్పులేదు. ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్‌కు లింక్ అయిన లోన్లకు 9.05 శాతంగా ఉంది.

ఇటీవల రెండు మానిటరీ పాలసీ కమిటీ సమావేశాల్లో ఆర్‌బీఐ పాలసీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోయినా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్‌ను పెంచుతూ  నిర్ణయం తీసుకోవడంపై నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌బీఐ రెపోరేటును స్థిరంగా ఉంచిన సమయంలో ఎంసీఎల్‌ఆర్ పెంపు కస్టమర్లపై భారం పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టులో జరిగే మానిటరీ పాలసీ సమావేశంలో కూడా ఆర్‌బీఐ పాలసీ రేట్లను ప్రస్తుత ధరల ప్రకారం కొనసాగించగలదని అంచనా వేస్తున్నారు. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు ఈ నెల చాలా ప్రత్యేకంగా మారింది. హెచ్‌డీఎఫ్‌సీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలీనం జూలై 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 13వ తేదీ నుంచి స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో హెచ్‌డీఎఫ్‌సీ షేర్ల ట్రేడింగ్ నిలిచిపోనుంది. విలీనం తరువాత కస్టమర్ లాగిన్ వివరాలు ఏమి మారవు. గతంలో మాదిరే లాగిన్ అవ్వొచ్చు.  

Also Read: Bandi Sanjay About PM Modi Meeting: మోదీ సభలో BRS పెయిడ్ ఆర్టిస్టులుంటారు జాగ్రత్త

Also Read: Sony Best Smart Tv: హై టెక్నాలజీతో మార్కెట్‌లో Sony Bravia 4K డిస్‌ప్లే టీవీ, ఫీచర్స్‌ అన్ని అదుర్స్‌..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
HDFC Bank hikes MCLR by up to 15 bps on select tenures check here HDFC Latest interest rates
News Source: 
Home Title: 

HDFC Bank Interest Rates: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ.. వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం..!
 

HDFC Bank Interest Rates: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ.. వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం..!
Caption: 
HDFC Bank Hikes MCLR (Source: File)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
HDFC Bank Interest Rates: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ.. వడ్డీ రేట్లు పెంచుతూ
Ashok Krindinti
Publish Later: 
No
Publish At: 
Saturday, July 8, 2023 - 06:03
Created By: 
Krindinti Ashok
Updated By: 
Krindinti Ashok
Published By: 
Krindinti Ashok
Request Count: 
50
Is Breaking News: 
No
Word Count: 
308