Stomach Is Bloated: ఆధునిక జీవన శైలి కారణంగా అనారోగ్య వికారమైన ఆహారాలు తినే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతోపాటు పొట్ట సమస్యల బారిన పడే వారి సంఖ్య కూడా పెరుగుతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఆహారాలు తీసుకునే చాలామందిలో అజీర్ణం, గ్యాస్, మలబద్దకం, అసిడిటీ వంటి సమస్యలు వస్తున్నాయి. కొంతమందిలో పొట్ట నుంచి శబ్దం రావడం కూడా వస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యతో బాధపడేవారు తప్పకుండా అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీసే ఛాన్స్ కూడా ఉందని వారు అంటున్నారు.
పొట్ట నుంచి శబ్దం ఎందుకు వస్తుందో మీకు తెలుసా?:
కడుపులో గుసగుసలాడే శబ్దాన్ని వైద్య పరిభాషలో స్టొమక్ గ్రోలింగ్ అంటారు. ఆహారం పొట్టలో జీర్ణం అయినప్పుడు ప్రేగుల గుండా వెళ్లే క్రమంలో ఇలాంటి శబ్దాలు వస్తూ ఉంటాయి. ఇలా శబ్దాలు రావడం సాధారణమైనప్పటికీ తరచుగా వస్తే తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా
శబ్దం వల్ల తీవ్రవ్యాధులు ఏమైనా రావచ్చా?:
కున ఆహారాలు జీర్ణక్రియ కోసం చిన్నప్రేగును చేరినప్పుడు అది దానిని గ్రహించి జీర్ణం కోసం కొన్ని ఎంజైమ్‌లను చేయడమే కాకుండా దానికి అవసరమైన కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అయితే ఇలాంటి క్రమంలో ఆకలి తగ్గిపోయి కడుపులో శబ్దాలు వస్తూ ఉంటాయి. తరచుగా ఇలాంటి శబ్దాలు వస్తే తప్పకుండా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం చాలా మంచిది. ఇకపోతే దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. కొంతమందిలో ఇలాంటి శబ్దాలు తరచుగా రావడం వల్ల తీవ్ర జీర్ణక్రియ సమస్యల బారిన పడే ఛాన్స్ ఉంది.
పొట్ట నుంచి శబ్దం రాకుండా నివారించడం ఎలా..
పొట్ట నుంచి పదే పదే శబ్దం వస్తే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది అందులో ముఖ్యంగా మంచినీటిని అధికంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా సోంపుతో తయారుచేసిన హెర్బల్ టీం తాగడం వల్ల కూడా పొట్ట నుంచి సౌండ్ రావడం ఆగిపోతుందని నిపుణులు అంటున్నారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook