Top Export Cars from India that is S Presso from Maruti Suziki: ఆర్ధిక మాంద్యం ప్రభావమో మరొకటో తెలియదు గానీ మారుతి సుజుకి కంపెనీకు చెందిన ఛీప్ అండ్ బెస్ట్ కారు విదేశాల్లో అత్యధికంగా విక్రయమౌతోంది. విదేశాలకు ఎగుమతైన కార్లలో ఈ కారు అగ్రస్థానంలో నిలిచింది.
మాంద్యం ప్రభావం అన్ని దేశాల్లో స్పష్టంగా కన్పిస్తోంది. మే నెలలో ఇండియా నుంచి ఎగుమతి అయిన కార్లలో తగ్గుదల కన్పించింది. అదే సమయంలో మారుతి సుజుకి కంపెనీకు చెందిన చీప్ అండ్ బెస్ట్ కారు మాత్రం అత్యధికంగా విక్రయాలు నమోదు చేసింది. దేశంలో అత్యధికంగా విక్రయమయ్యే మారుతి సుజుకి బలేనో, మారుతి స్విఫ్ట్‌లను సైతం ఈ కారు వెనక్కి నెట్టేసింది. ఇండియాలో అతి తక్కువ ధరకు లభ్యమయ్యే మారుతి సుజుకి కారు విదేశాల్లో ఎక్కువగా విక్రయాలు నమోదు చేసింది. గత నెల అంటే మే నెలలో కార్ల ఎగుమతిలో 6.42 శాతం క్షీణత కన్పించింది. అన్ని కంపెనీల కార్లు కలిపి మొత్తం 53,237 యూనిట్లే విదేశాలకు ఎగుమతి అయ్యాయి. వీటిలో ఎక్కువగా విక్రయమైంది మారుతి సుజుకి కారు.
మే నెలలో మారుతి సుజుకికు చెందిన మారుతి ఎస్‌ప్రెసో అత్యధికంగా ఎగుమతైంది. 5,925 యూనిట్లు విదేశాల్లో విక్రయమయ్యాయి. గత ఏడాది అంటే మే 2022లో ఇదే కారు 3,925 యూనిట్లు విక్రయాలు జరపగలిగింది. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మారుతి సుజుకి ఎస్‌ప్రెసో కారు గణనీయమైన వృద్ధి సాధించింది. ఏకంగా 60 శాతం వృద్ధి కన్పించింది. ఈ కారు ధర ఇండియాలో కేవలం 4.2 లక్షల నుంచే ప్రారంభమౌతుంది.
Also Read: Small Savings Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి పథకాలపై కేంద్రం కీలక మార్పులు.. ఆర్థిక శాఖ ఉత్తర్వులు
ఇక విదేశాలకు ఎగుమతి అవుతున్న టాప్ 10 కార్లలో రెండవ స్థానంలో ఉంది హ్యుండయ్ యాక్సెంట్. ఈ కారు 5,198 యూనిట్లు విక్రయాలు నమోదు చేసింది. మూడవ స్థానంలో మారుతి సుజుకి బలేనో 4,910 యూనిట్లు, మారుతి సెలేరియో 3,413 యూనిట్లు విదేశాలకు ఎగుమతయ్యాయి. మారుతి సెలేరియో కూడా గత ఏడాదితో పోలిస్తే 150 శాతం వృద్ధి నమోదు చేసింది.
ఇక ఐదవ స్థానంలో వోక్స్‌వేగన్ 3,099 యూనిట్లు ఎగుమతయ్యాయి. 6వ స్థానంలో మారుతి డిజైర్ 7వ స్థానంలో కియా సోనెట్ ఉన్నాయి. ఇక 8వ స్థానంలో మారుతి ఎర్టిగా, 9వ స్థానంలో మారుతి స్విఫ్ట్, పదవ స్థానంలో సెల్టోస్ ఉన్నాయి. మారుతి ఎర్టిగా కూడా గత ఏడాదితో పోలిస్తే 230 శాతం వృద్ది నమోదైంది. మొత్తానికి మేకిన్ ఇన్ ఇండియా , మేడిన్ ఇన్ ఇండియా కార్లకు విదేశాల్లో డిమాండ్ పెరుగుతోంది. స్వదేశీ బ్రాండ్ మారుతి సుజుకి విదేశీ గడ్డపై కూడా రాజ్యమేలుతోంది.
Also Read: Reserve Bank Of India: రూల్స్ బ్రేక్.. ఈ మూడు బ్యాంక్‌లపై ఆర్‌బీఐ భారీ జరిమానా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook