Today Rain Update in Telangana State: ఇవాశ, రేపు తెలంగాణ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని 8 జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ పేర్కొంది. ఈ నేపథ్యంలో హెచ్చరికలు కూడా జారీ చేసింది. శనివారం మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 115.6 - 204.4 మి.మీ.ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు తెలిపింది. మరో ఏడు జిల్లాల్లో 64.5 - 115.5 మి.మీ.ల మధ్య వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రమంతటా రుతుపవనాలు విస్తరిస్తున్నాయని.. దాని ప్రభావం కారణంగానే వాతావరణం చల్లబడిందని ఐఎండీ తెలిపింది.
వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో ఆవర్తనం కొనసాగుతోంది. ఈ జిల్లాల్లో విపత్తు స్పందన దళాలు అప్రమత్తం కావాలని వాతావరణ శాఖ సూచించింది. అయితే నైరుతి రుతుపవనాలు శుక్రవారం నాటికి నిజామాబాద్ జిల్లాలో కొంత భాగం వరకు వ్యాపించాయి. మెదక్, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలతోపాటు ఆదిలాబాద్ జిల్లాలో కొంత భాగం వ్యాపించాల్సి ఉంది. ఈ రుతుపవనాలు ఆదివారం నాటికి రాష్ట్రమంతటా విస్తరిస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది.
ఆదివారం.. నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు... రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, జగిత్యాల, ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గత రెండు రోజులుగా వివిధ జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురిశాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరులో అత్యధికంగా 8 సెం.మీటర్లు వర్షపాతం నమోదైంది.
Also Read: Telangana Govt Employees: ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. అలవెన్స్‌లు భారీగా పెంపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook