/telugu/photo-gallery/allu-konidela-family-dispute-over-allu-aravind-meets-to-pawan-kalyan-with-tollywood-producers-rv-145114 Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం 145114

Upasana Delivery: మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో ఇప్పుడు పండుగ వాతావరణం నెలకొంది. మరి కొద్దిగంటల్లో ఆ ఇంట ఓ నవ శిశువు అడుగెట్టనుంది. నిండు గర్భిణీ అయిన మెగా కోడలు ఉపాసన కాస్సేపటి క్రితమే ఆసుపత్రిలో చేరింది. డెలివరీ డేట్ కూడా ఫిక్స్ అవడంతో ఇక నిరీక్షణే మిగిలింది.

మెగాస్టార్ చిరంజీవికి మనవడు లేదా మనవరాలు పుట్టనుంది. మెగా కోడలు రేపు పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. రామ్ చరణ్ తండ్రి కానున్నాడు. 9 నెలల పూర్తి గర్భిణీగా ఉపాసన కాస్సేపటి క్రితమే జూబిలీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరింది. రేపు డెలీవరీ డెట్ ఫిక్స్ అవడంతో మెగా కుటుంబంలో అంతా నిరీక్షణ నెలకొంది. జూన్ 20న అంటే మరి కొద్దిగంటల్లో చిరంజీవి ఇంట కొత్త సభ్యుడు లేదా సభ్యురాలు అడుగెట్టనుంది. నిండు గర్భిణీగా ఉన్నా ఇన్‌స్టా ఫాలోవర్ల కోసం ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ షేర్ చేస్తోంది ఉపాసన. పెళ్లయిన పదేళ్లకు ఈ జంట తొలి బిడ్డకు జన్మనిస్తుండటంతో ఆసక్తి నెలకొంది. జూనియర్ చరణ్ కోసం ఎదురు చూస్తున్నామంటూ అభిమానులు కామెంట్లు కూడా పెడుతున్నారు. 

2012లో పెళ్లి చేసుకున్న రామ్ చరణ్ - ఉపాసన జంట తల్లిదండ్రులు కానున్నట్టు గత యేడాది డిసెంబర్ 12న ప్రకటించారు. పుట్టబోయే బిడ్డ కోసం పూర్తి సమయాన్ని వెచ్చించేందుకు, ఉపాసనతో గడిపేందుకు రామ్ చరణ్ ఆగస్టు వరకూ షూటింగులకు బ్రేక్ ఇస్తున్నట్టు నిర్ణయించుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్‌తో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల కానుంది.

ఇప్పుడు సర్వత్రా ఒకే అంశంపై చర్చ లేదా ఉత్కంఠ నెలకొంది. మెగా కుటుంబంలో వారసుడు వస్తున్నాడా లేదా వారసురాలు వస్తుందా అనే ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. ఎవరికి వారు అంచనాలు వేసుకుంటూ కామెంట్ల రూపంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

Also read: Adipurush Movie: ఆదిపురుష్ సినిమా రచయిత మనోజ్ శుక్రాకు ప్రాణ హాని, రక్షణం కోసం ముంబై పోలీసులకు వినతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Ramcharan wife upasana delivery tomorrow reached apollo hospital just now all mega family in festive mood
News Source: 
Home Title: 

Upasana Delivery: ఉపాసన డెలివరీ రేపే, మెగా ఇంట అడుగెట్టేది వారసుడా వారసురాలా

Upasana Delivery: ఉపాసన డెలివరీ రేపే, మెగా ఇంట అడుగెట్టేది వారసుడా వారసురాలా
Caption: 
Ramcharan and upasana ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Upasana Delivery: ఉపాసన డెలివరీ రేపే, మెగా ఇంట అడుగెట్టేది వారసుడా వారసురాలా
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Monday, June 19, 2023 - 21:15
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
32
Is Breaking News: 
No
Word Count: 
270