Budh Asta 2023 Bad Effect: గ్రహాలు కాలానుగుణంగా ఉదయించడం లేదా అస్తమించడం చేస్తాయి. ఇది మెుత్తం 12 రాశులవారి జీవితాలపై సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. ఇటీవల బుధుడు వృషభరాశిలోకి ప్రవేశించాడు. మరో ఆరు రోజుల్లో అంటే జూన్ 19న అదే రాశిలో అస్తమించబోతున్నాడు. సాధారణంగా గ్రహాల ఆస్తమయం చెడు ఫలితాలనే ఇస్తుంది. బుధుడి అస్తమయం వల్ల ఏయే రాశులవారు ఇబ్బందులు ఎదుర్కోనున్నారో తెలుసుకుందాం.
బుధుడి అస్తమయం ఈ రాశులకు నష్టదాయకం
వృషభం
ఇదే రాశిలో బుధుడి అస్తమయం జరగబోతుంది. దీని కారణంగా వృషభరాశి వారికి సమస్యలు పెరుగుతాయి. ఈ సమయంలో మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. మీరు కుటుంబ సమస్యలతో పాటు మానసిక, ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కోంటారు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం దక్కదు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేట్ అవుతుంది. మీ వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
కర్కాటక రాశి
కర్కాటక రాశికి చెందిన పదకొండవ ఇంట్లో బుధుడు అస్తమించబోతున్నాడు. దీని వల్ల మీరు ఉద్యోగ, వ్యాపారాల్లో అనేక సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. మీకు ఇంక్రిమెంట్ లేదా ప్రమోషన్ రావడం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. వ్యాపారులు భారీగా నష్టాలను చవిచూస్తారు. మీ ఆర్థిక స్థితి దిగజారుతుంది. మీ లవ్ లో సమస్యలు వస్తాయి.
Also Read: Surya Gochar 2023: మరో 2 రోజుల్లో ఈ 4 రాశులకు మహార్దశ.. మీ రాశి ఉందా?
సింహరాశి
సింహరాశి వారి జాతకంలోని పదో ఇంట్లో మెర్క్యూరీ అస్తమించబోతున్నాడు. దీని వల్ల ఈ రాశి వారు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోనున్నారు. మీకు లక్ కలిసి రాదు. వ్యాపారులు నష్టాలను ఎదుర్కోవల్సి ఉంటుంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కష్టతరం అవుతుంది. మీ ఆర్థిక పరిస్థితి దిగజారే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా చేయాలనుకునే ముందు బాగా ఆలోచించి ఫ్లాన్ చేయండి.
Also Read: Mars transit 2023: 'నీచభంగ్ రాజయోగం' చేసిన కుజుడు.. ఈ 3 రాశుల బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి