Earthquake Today Latest Updates: దేశ రాజధాని ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ పాటు ఉత్తర భారత్‌లోని పలు ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించింది. 10 సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటికి పరుగులు తీశారు. ఢిల్లీలో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.0 గా నమోదు కాగా.. జమ్మూకశ్మీర్లో 5.7గా నమోదైంది. భూకంపం ప్రకంపనలు చైనా, పాకిస్తాన్ వరకు కనిపించాయి. భూకంప కేంద్రం పాకిస్థాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. భూకంపంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.
మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత వచ్చిన భూకంపం కొన్ని సెకన్ల పాటు కొనసాగింది. అయితే ఎలాంటి నష్టం లేదా ప్రాణ నష్టం జరగలేదు. చండీగఢ్, జైపూర్, పరిసర ప్రాంతాలలో భూకంపం సంభవించింది. ఇస్లామాబాద్, లాహోర్, పాకిస్థాన్‌లోని పరిసర ప్రాంతాలలో భూకంప ప్రకంపనలు చాలా బలంగా సంభవించినట్లు సమాచారం. భూకంపం గురించి ప్రజలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
శ్రీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి భూకంపం గురించి మాట్లాడుతూ.. మంగళవారం సంభవించి భూకంపం చాలా ఎక్కువగా ఉందని తెలిపాడు. స్కూళ్లో ఉన్న విద్యార్థులు చాలా భయపడ్డారని చెప్పాడు. కాగా.. గత కొన్ని నెలలుగా భారత్‌తో సహా ఇతర దేశాల్లో భూకంపాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే.
Also Read: Revanth Reddy: లీగల్ నోటీసు వెనక్కి తీసుకోండి.. ఐఏఎస్ అధికారికి రేవంత్ రెడ్డి హెచ్చరిక
Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్ జాయ్ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook