Saturn Retrograde 2023: శని గ్రహంలో ఏర్పడనున్న కేంద్ర త్రికోణ రాజయోగం, జూన్ 17 నుంచి ఈ 4 రాశులకు మహర్దశ, పట్టిందల్లా బంగారం

Saturn Retrograde 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల కదలిక, రాశి ప్రవేశం, వివిధ యోగాలు నిర్మాణంతో అన్ని రాశులపై ప్రభావం పడుతుంటుంది. ఈ ప్రభావం కూడా ఒక్కొక్క గ్రహంపై ఒక్కోలా ఉంటుంది. ఈ క్రమంలో మరో ఆరు రోజుల్లో ఏర్పడనున్న కేంద్ర త్రికోణ రాజయోగం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 11, 2023, 07:22 AM IST
Saturn Retrograde 2023: శని గ్రహంలో ఏర్పడనున్న కేంద్ర త్రికోణ రాజయోగం, జూన్ 17 నుంచి ఈ 4 రాశులకు మహర్దశ, పట్టిందల్లా బంగారం

Saturn Retrograde 2023: హిందూ పంచాంగం ప్రకారం ప్రతి వ్యక్తి జీవితంలో శని గ్రహం ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. జూన్ 17వ తేదీన అంటే మరో ఆరు రోజుల్లో శని గ్రహం కుంభరాశిలో వక్రమార్గం పట్టనుండటంతో కొన్ని రాశుల జాతకం ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. ఆ వివరాలు తెలుసుకుందాం..

జూన్ 17 నుంచి నవంబర్ 4వ తేదీన వరకూ అంటే 5 నెలల వరకూ శని గ్రహం వక్రమార్గంలో కుంభ రాశిలో ఉంటుంది. శని గ్రహం ప్రభావం మిగిలిన గ్రహాలతో పోలిస్తే ఇతర రాశులపై అధికంగా కన్పిస్తుంది. శని గ్రహాన్ని హిందూ విశ్వాసాల ప్రకారం కర్మ ఫలదాతగా అంటే చేసిన పనులకు ప్రతిఫలాన్నిచ్చే న్యాయదేవతగా భావిస్తారు. శనిగ్రహం జూన్ 17వ తేదీన 19 గంటల 48 నిమిషాలకు వక్రమార్గం పట్టనున్నాడు. ఫలితంగా కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడనుంది. ఈ ప్రభావం అన్ని రాశులపై పడినా కొన్ని రాశులకు అమితమైన లాభాల్ని అందించనుంది.

మకర రాశి

జూన్ 17వ తేదీన శని గ్రహం కుంభ రాశిలో వక్రమార్గం పట్టనుండటంతో మకర రాశి జాతకులకు మహర్దశ పట్టనుంది. శని కటాక్షం కారణంగా ఈ రాశి వారికి డబ్బుల సమస్య తీరిపోతుంది. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. ఆరోగ్యం పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులకు, వ్యాపారులకు మంచి అనువైన సమయం. వివిధ రంగాల్లో ధన లాభం కలగనుంది. వ్యక్తికి సామాజికంగా పరువు ప్రతిష్ఠలు లభిస్తాయి.

మేష రాశి

జ్యోతిష్యం ప్రకారం శని గ్రహం జూన్ 17 నుంచి నవంబర్ 4 వరకూ వక్రమార్గంలో ఉండటం ద్వారా ఏర్పడే కేంద్ర త్రికోణ రాజయోగం ఫలితంగా మేష రాశి జాతకులకు ఊహించని లాభాలు కలగనున్నాయి. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు. కష్టపడటం వల్ల రానున్న కాలంలో ఊహించని లాభాలు ఎదురౌతాయి. కెరీర్ పరంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. అయితే దీనికోసం కష్టపడాలి. కష్టానికి తప్పకుండా ప్రతిఫలం ఉంటుందంటున్నారు జ్యోతిష్య పండితులు. ఆర్ధికంగా లాభాలుంటాయి.

సింహ రాశి

శని వక్రమార్గం కారణంగా ఏర్పడే కేంద్ర త్రికోణ రాజయోగంతో సింహ రాశి జాతకులకు అత్యధిక లాభం కలగనుంది. వ్యాపారపరమైన నిర్ణయాల్లో లాభాలుంటాయి. ఉద్యోగంలో మంచి ఆదాయం లభించవచ్చు. ఆర్ధికంగా లాభపడతారు. ఎప్పట్నించో పెండింగులో ఉన్న డబ్బులు చేతికి అందుతాయి. ఉద్యోగంలో బదిలీ ఉండవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృషభ రాశి

కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడటంతో జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అత్యంత మహత్యం కలిగి ఉంటుంది. ఈ యోగాన్ని అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఫలితంగా వృషభ రాశి జాతకుల ఆదాయం ఊహించని విధంగా పెరిగిపోతుంది. కుటుంబసభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. ఉద్యోగంలో పదోన్నతి, ఇంక్రిమెంట్లు లాభిస్తాయి. ఆరోగ్యం విషయంలో ఏ సమస్యా ఎదురుకాదు. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. వ్యాపారంలో లాభాలు ఆర్ధికంగా మీ స్థితిని మెరుగుపరుస్తాయి.

Also read: Shukra Gochar 2023: జూలై 07 వరకు కర్కాటక రాశిలోనే శుక్రుడు.. ఈ 3 రాశులకు ఊహించనంత ధనం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News