Delay in Southwest Monsoon: నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమైంది. ఇప్పటికే కేరళ తీరాన్ని తాకాల్సిన నైరుతి రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. మరో మూడు రోజుల తర్వాతే కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనావ వేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే జూన్ 15 వరకు తెలంగాణలో వర్షాలు పడకపోవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. కిందట సంవత్సరం జూన్ 1 నాటికే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. తాజాగా పరిశీలిస్తే ఇవి అండమాన్ నికోబార్ దీవులను దాటి బంగాళాఖాతలో ఆగిపోయాయి.
ఎల్ నినో కారణమా..
రుతుపవనాల మందగమనం కారణంగా ఈ ఏడాది వర్షపాతం 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి ఎల్ నినో ప్రభావం కొంత కారణంగా కావచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీని ఎఫెక్ట్ వల్ల మన దేశంలో కరవు పరిస్థితులు ఏర్పడతాయి. అదే సమయంలో పెరూ, అమెరికా వంటి దేశాల్లో కుంభవృష్టి కురుస్తుంది.
Also Read: 10 years Old Boy Drawing Skills: చూసింది చూసినట్టు అచ్చు దించేస్తాడు..
మరో 4 రోజులపాటు వడగాలులు..
రుతు పవనాలు లేట్ అవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఎండ తీవ్రతకు కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ నెల 09వ తేదీ నుంచి వేడి గాలులు వీస్తాయని ఇప్పటికే ఐెండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళవారం నుంచి నాలుగు రోజులపాటు రాష్ట్రంలో 42 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే అక్కడక్కడే తేలికపాటి జల్లులు కూడా పడవచ్చని వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న అన్నారు.
Also Read: YS Sharmila Slams BJP, BRS: ఈ దెబ్బతో బీజేపి, బీఆర్ఎస్ దోస్తీ బయటపడిందన్న షర్మిల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK
జూన్ 15 నాటికి తెలంగాణకు రుతుపవనాలు.. అప్పటి వరకు మండిపోనున్న ఎండలు..