Utkarsha Pawar Touches MS Dhoni Feet: ఉత్కంఠభరిత పోరులో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించడంతో కెప్టెన్ ఎంఎస్ ధోనీ భావోద్వేగానికి గురయ్యాడు. చివరి రెండు బంతులకు సిక్సర్, ఫోర్‌తో జట్టును గెలిపించిన రవీంద్ర జడేజాను ఎత్తుకుని సంబరపడిపోయాడు. సీఎస్‌కే విజయం సాధించి ఐదు రోజులు అయినా.. ఇప్పటికీ ఆ మ్యాచ్ గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇక చెన్నై ఆటగాళ్లు మ్యాచ్ ముగిసిన అనంతరం తమ భార్యలతో గ్రౌండ్‌లో ఫోటోలకు పోజులిచ్చారు. జడేజా తన భార్య రివాబాతో కలిసి ఐపీఎల్ ట్రోఫీతో ఫొటోలు దిగాడు. మైదానంలోకి వచ్చిన రివాబా.. తన భర్త జడేజా కాళ్ల మొక్కి ఆశీర్వాదం తీసుకున్న వీడియో నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే.
తాజాగా మరో వీడియో తెరపైకి వచ్చింది. చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ తనకు కాబోయే భార్య ఉత్కర్ష పవార్‌ను ధోనీకి పరిచయం చేశాడు. ధోనీతో ముచ్చటించిన ఉత్కర్ష.. అనంతరం పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో క్రికెట్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఉత్కర్షను అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. గైక్వాడ్ ఉత్కర్షను నేడు వివాహం చేసుకోనున్నాడు. పెళ్లి కోసం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ నుంచి తప్పుకున్నాడు రుతురాజ్ గైక్వాడ్.
Utkarsha (Mrs. Rutu) taking blessing of Dhoni 😍❤️💛. So Cute and Adorable🤌💕💞 pic.twitter.com/o5xH5RHMew
— Sai Vamshi Patlolla (@sai_vamshi21) June 1, 2023
రుతురాజ్ గైక్వాడ్‌కి కాబోయే భార్య ఉత్కర్ష పవార్ కూడా క్రికెటర్. ఆమె దేశవాళీ క్రికెట్‌లో మహారాష్ట్ర తరఫున ఆడింది. ఉత్కర్ష ఒక ఆల్ రౌండర్. కుడిచేతి వాటంతో బ్యాటింగ్ చేయడంతోపాటు ఫాస్ట్ బౌలింగ్ కూడా చేస్తుంది. అయితే ఆమె దాదాపు రెండేళ్లుగా ఒక్క క్రికెట్ మ్యాచ్ కూడా ఆడడం లేదు. దీంతో వృత్తిపరమైన క్రికెట్ కెరీర్ పూర్తి అయినట్లుంది. 1998 అక్టోబర్ 13న జన్మించిన ఉత్కర్ష పవార్.. 11 ఏళ్ల వయసు నుంచే క్రికెట్ ఆడుతోంది. 2021 నవంబర్ 15న ఉత్కర్ష చివరి క్రికెట్ మ్యాచ్ ఆడింది.
Also Read: Odisha Train Accident: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు..
ఈ సీజన్‌లో గైక్వాడ్ అద్బుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 16 మ్యాచ్‌ల్లో 147.50 స్ట్రైక్ రేట్‌తో 590 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ధసెంచరీలు ఉన్నాయి. డేవాన్ కాన్వేతో కలిసి చెన్నైకు మెరుపు ఆరంభాలు అందించాడు. కాన్వే, గైక్వాడ్ నిలకడ ప్రదర్శనతోనే చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది.
Also Read: Telangana Formation Day: ఇదో మైలురాయి.. నా జీవితం ధన్యమైంది: సీఎం కేసీఆర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి