Medical Colleges: ఏపీలో ఈ ఏడాది నుంచి 5 మెడికల్ కళాశాలలు ప్రారంభం

Medical Colleges: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్యవిద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ ఏడాది నుంచి ఏపీలో రికార్జు స్థాయిలో 5 మెడికల్ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. ఎక్కడెక్కడ, ఎన్నెన్ని సీట్లంటే..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 1, 2023, 06:31 PM IST
Medical Colleges: ఏపీలో ఈ ఏడాది నుంచి 5 మెడికల్ కళాశాలలు ప్రారంభం

Medical Colleges: ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం వైద్య విద్యకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తోంది. కరోనా సంక్షోభం అనంతరం రాష్ట్రంలో వైద్య సదుపాయాలు పెంచాలనే ఉద్దేశ్యంతో జిల్లాకొక వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఐదు కళాశాలలు ప్రారంభం కానున్నాయి. 

ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాల కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట్రంలో తొలి వైద్య కళాశాల విశాఖలో వందేళ్ల క్రితం ప్రారంభమైంది. ఈ వందేళ్ల కాలంలో రాష్ట్రంలో ఏర్పడిన వైద్య కళాశాలలు 11 మాత్రమే. ఈ పరిస్థితిని అధిగమించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య విద్యపై ప్రధాన దృష్టి సారించింది. రాష్ట్రంలో కొత్తగా 17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కొక్క మెడికల్ కళాశాలకు 500 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. 

ఇందులో భాగంగా ఈ ఏడాది నుంచి 5 కొత్త మెడికల్ కళాశాలలు ప్రారంభం కానున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని స్పష్టం చేశారు. విజయనగరం, నంద్యాల, ఏలూరు, మచిలీపట్నం, రాజమండ్రి మెడికల్ కళాశాలల్లో ఈ ఏడాది అంటే 2023 ఆగస్టులో అడ్మిషన్లు భర్తీ చేయనున్నామని మంత్రి రజని చెప్పారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి క్లాసులు ప్రారంభమౌతాయన్నారు. ఒక్కొక్క మెడికల్ కళాశాలలో 150 సీట్ల చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు ఈ ఏడాది నుంచి అందుబాటులో రానున్నాయి. మరోవైపు వైఎస్ జగన్ ప్రభుత్వం హయంలో రాష్ట్రంలో 462 పీజీ సీట్లు అందుబాటులో తీసుకొచ్చామని మంత్రి రజని స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో ప్రజలందరీ మెరుగైన వైద్యం అందించే ఉద్దేశ్యంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చామని మంత్రి విడదల రజని చెప్పారు. ముఖ్యమంత్రిగా జగన్ వైద్య ఆరోగ్యశాఖలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. ఒక్క వైద్య ఆరోగ్యశాఖలోనే గతంలో ఎన్నడూ లేనివిధంగా 49 వేల పోస్టులు భర్తీ చేసినట్టు మంత్రి స్పష్టం చేశారు. 

Also read: CM Jagan Mohan Reddy: రైతులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్.. అకౌంట్‌లోకి డబ్బులు వచ్చేశాయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News