Public Provident Fund Latest Updates: ప్రస్తుతం ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న పథకం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్). ఈ పథకంలో దీర్ఘకాలికంగా పెట్టుబడి మంచి రాబడి పొందుతున్నారు. ఈ పథకంలో అందించే వడ్డీ రేటును ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తారు. ప్రస్తుతం పీపీఎఫ్ పథకం కింద 7.1 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నారు. ఈ పథకంలో ఎక్కువ ప్లస్‌లు ఉన్నా.. కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.
ఈపీఎఫ్ వడ్డీ రేటు కంటే తక్కువ
పీపీఎఫ్ పథకంలో ఆఫర్ చేసే వడ్డీ రేటు ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) వడ్డీ రేటు కంటే తక్కువగా ఉంటుంది. పీఎఫ్ పొందే ఉద్యోగులకు పీపీఎఫ్ పెద్దగా ఆకర్షించదు. మెరుగైన ఆదాయం, ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్) ద్వారా ఈపీఎఫ్‌కి ఎక్కువ మొత్తాన్ని కేటాయించవచ్చు. ప్రస్తుత ఈపీఎఫ్ రేటు 8.15 శాతంగా ఉంది. ప్రస్తుతం పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1%. చాలా మంది జీతభత్యాలు తమ ట్యాక్స్ పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించుకోవడానికి పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే వీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పీపీఎఫ్ కంటే ఎక్కువ వడ్డీని పొందడంతోపాటు.. పన్ను ప్రయోజనాలను పొందవచ్చు.
లాంగ్ లాక్ ఇన్ పీరియడ్
పీపీఎఫ్ ఖాతా మెచ్యూర్ కావడానికి 15 సంవత్సరాలు పడుతుంది. ఎక్కువ కాలంపాటు ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఇది మంచిదే. కానీ స్వల్పకాలంలో లాభాలు ఆశించే వారికి ఈ పథకం ఉపయోగపడదు. పెట్టుబడిదారులకు డబ్బులు అత్యవసర అవసరమైతే.. ఇందులో డబ్బు తీసుకునే అవకాశం ఉండదు.
స్థిర గరిష్ఠ డిపాజిట్ పరిమితి
మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో పీపీఎఫ్ ఖాతాలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేయాలనుకునే ఉద్యోగులకు పెద్దగా ప్రయోజనం చేకూరదు.
విత్ డ్రాకు కఠిన నిబంధనలు..
పీపీఎఫ్ నుంచి అనుకోకుండా నగదు విత్ డ్రాకు కఠినమైన నిబంధనలు ఉంటాయి. అకౌంట్ ఓపెన్ సంవత్సరాన్ని మినహాయించి.. ఐదేళ్ల తర్వాత ఆర్థిక సంవత్సరానికి ఒక ఉపసంహరణకు మాత్రమే పరిమితం. ఒక శాతం వడ్డీ మినహాయింపునకు లోబడి ఐదేళ్ల తర్వాత మాత్రమే ప్రీమెచ్యూర్ క్లోజర్ అనుమతి ఉంటుంది.
అకౌంట్ క్లోజ్ చేయాలనుకుంటే..
==> ఖాతాదారుడు లేదా జీవిత భాగస్వామి లేదా ఆధారపడిన పిల్లలు ప్రాణాంతక అనారోగ్యంతో బాధపడుతున్నప్పడు క్లోజ్ చేసుకోవచ్చు.
==> ఖాతాదారుడు లేదా అతనిపై ఆధారపడిన పిల్లల ఉన్నత విద్య కోసం..
==> అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఒక శాతం వడ్డీ వసూలు చేస్తారు. ప్రీక్లోజింగ్‌కు బదులు పథకంలో పీపీఎఫ్ ఖాతాదారులు ప్రతి ఆర్థిక సంవత్సరంలో రూ.500 డిపాజిట్ చేస్తూ.. అకౌంట్‌ను కొనసాగించవచ్చు.
Also Read: IPL 2023 Playoffs: ప్లే ఆఫ్స్ చేరిన నాలుగు జట్లు.. ఎవరితో ఎవరు ఢీ అంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి