CSK Enters IPL 2023 PlayOffs After Beat DC, Qualifier 1 May Play GT and CSK: ఐపీఎల్ 2023 చివరి లీగ్ మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో డిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పరుగుల 77 తేడాతో విజయం సాధించింది. ఈ అద్భుత విజయంతో చెన్నై జట్టు ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్ బెర్తుని ఖరారు చేసుకుంది. చెన్నై నిర్దేశించిన 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (86) టాప్ స్కోరర్. చెన్నై బౌలర్ దీపక్ చహర్ మూడు వికెట్స్ పడగొట్టాడు.
224 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆదినుంచే తడబడింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (86; 58 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒక్కడే పోరాడాడు. వార్నర్‌తో సహా యశ్ ధుల్ (13), అక్షర్ పటేల్ (15) మాత్రమే ఢిల్లీ బ్యాటర్లలో డబుల్ డిజిట్ స్కోరు సాధించారు. పృథ్వీ షా (5), ఫిలిప్ సాల్ట్ (3), రిలీ రొసో (0), అమన్ ఖాన్ (7), లలిత్ యాదవ్ (6), అన్రిచ్ నోర్జ్ (0), కుల్‌దీప్ యాదవ్ (0) సింగిల్ డిజిట్ స్కోర్ చేశారు. చెన్నై బౌలర్ల దాటికి ఢిల్లీ బ్యాటర్లు చేతులెత్తాశారు. చెన్నై బౌలర్లలో దీపక్ చహర్ మూడు వికెట్లు పడగొట్టగా.. పతిరణ 2, మహీశ్ తీక్షణ 2 వికెట్స్ తీశారు. రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (79; 50 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు), డేవాన్ కాన్వే (87; 52 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) రెచ్చిపోయి ఆడారు. ఢిల్లీ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పరుగులు చేశారు. ఇన్నింగ్స్ చివర్లో శివమ్ దూబె (22; 9 బంతుల్లో 3 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (20 నాటౌట్; 7 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించారు. ఎంఎస్ ధోనీ అభిమానులను నిరాశపరిచాడు. ఇక డిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్జ్, చేతన్ సకారియా ఒక్కో వికెట్ పడగొట్టారు.
𝙇𝙚𝙩 𝙩𝙝𝙚 𝙬𝙝𝙞𝙨𝙩𝙡𝙚𝙨 𝙗𝙚𝙜𝙞𝙣 🥳
𝗖𝗛𝗘𝗡𝗡𝗔𝗜 𝗦𝗨𝗣𝗘𝗥 𝗞𝗜𝗡𝗚𝗦 have qualified for the #TATAIPL 2023 Playoffs 💪🏻#DCvCSK | @ChennaiIPL pic.twitter.com/xlSNgjq09B
— IndianPremierLeague (@IPL) May 20, 2023
Also Read: Karnataka New Government: కర్ణాటకలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం, తొలి కేబినెట్ ఇదే
Also Read: Chaitanya Master Suicide : మల్లెమాల, ఢీ షోపై ట్రోల్స్.. చైతన్య మాస్టర్‌ను మరిచిపోయారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.