Tamannaah Boyfriend Vijay Varma About Their Relation: నిజానికి గత కొంతకాలంగా మిల్కీ బ్యూటీ తమన్నా నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తుందనే వార్త పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తమన్నా విజయవర్మ కలిసి చాలా చోట్ల పబ్లిక్ గానే కనిపించారు. నిజానికి ముందుగా వీరు గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సమయంలో కలిసి కనిపించడంతో ఒక్కసారిగా అందరిలో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారేమో అని అనుమానాలు మొదలయ్యాయి.
దానికి తోడు వారు అదే సమయంలో ముద్దులు పెట్టుకుంటూ కెమెరా కంటికి చెక్కడం ఆ తర్వాత గోవా నుంచి తిరిగి ముంబై వస్తున్న సమయంలో కూడా వారు కలిసే ఉండడంతో డేటింగ్ లో ఉన్నారని ప్రచారం మొదలైంది. ఇప్పుడు తాజాగా వీరిద్దరి డేటింగ్ సంబంధించిన విషయం మీద క్లారిటీ వచ్చేసింది. విజయ వర్మ, సోనాక్షి సిన్హా నటించిన ‘దహాద్’ అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించాడు.
Also Read: Anchor Jhansi: ఆ హీరోతో అఫైర్, ఇంటిపై రైడ్స్.. యాంకర్ ఝాన్సీ సంచలన ఆరోపణలు
ఈ క్రమంలో మరో నటుడు విజయ్ తో తమన్నా రిలేషన్షిప్ గురించి ఓపెన్ గానే విజయవర్మను ప్రశ్నిస్తే విజయ్ సిగ్గుపడుతూనే తాను తమన్నాతో డేటింగ్ లో ఉన్నాను అనే విషయాన్ని ఒప్పుకున్నాడు. ఇలా విజయ్ వర్మ నేరుగా ఒప్పుకోవడంతో చాలా కాలం నుంచి జరుగుతున్న వీరి డేటింగ్ ప్రచారానికి ఒక రకమైన క్లారిటీ వచ్చేసినట్లే చెప్పాలి. హైదరాబాద్‌కు చెందిన విజయ వర్మ సినిమాల్లో నటించడం కోసమే ముంబైకి వెళ్లి అక్కడ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.
పింక్ సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన గల్లీ బాయ్ సినిమాతో పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత మీర్జాపూర్ వెబ్ సిరీస్ ద్వారా కూడా ఆయనకు మంచి పేరు వచ్చింది. ఇక తెలుగు విషయానికి వస్తే ఆయన నాని నటించిన ఎంసీఏ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఇక తమన్నా విజయ్ వర్మ మొట్టమొదటిసారిగా లస్ట్ స్టోరీస్ 2 షూటింగ్లో కలుసుకున్నారు. ఆ తర్వాత వారి మధ్య ప్రేమ మొదలై అది ఇక్కడిదాకా తీసుకువచ్చింది. అంతేకాదు తమన్నా పుట్టినరోజు వేడుకలకు కూడా విజయవర్మ ఆమె ఇంటికి స్వయంగా వెళ్లి పాల్గొనడం హాట్ టాపిక్ అయింది.
Also Read: Custody Movie Review: 'కస్టడీ' సినిమా రివ్యూ : నాగ చైతన్య హిట్టు కొట్టాడా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook