Jyeshta Masam Precautions: హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి నెలకు విశిష్టత ఉన్నట్టే..జ్యేష్ఠమాసానికి ఓ ప్రత్యేకత ఉంది. హిందూ కేలండర్ ప్రకారం మే 6న జ్యేష్ఠమాసం ప్రారంభం కానుంది. జ్యేష్ఠమాసంలో అప్రమత్తంగా ఉండటమే కాకుండా ధార్మిక కార్యక్రమాలు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. లేకపోతే మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందంటారు. కొన్ని రకాల పొరపాట్లు లేదా తప్పులు అస్సలు చేయకూడదు. అప్రమత్తంగా లేకపోతే ఈ నెలలో ఆ ఇంట్లో దారిద్ర్యం తాండవిస్తుంది. సుఖ సంతోషాలు తొలగిపోతాయి.
ఆపన్నులకు అన్నదానం
జ్యోతిష్య పండితుల ప్రకారం జేష్ఠమాసంలో ఇంటికొచ్చిన బిచ్చగాళ్లకు లేదా అపన్నులను ఒట్టి చేతులతో వెనక్కి పంపించకూడదంటారు. ఈ తప్పు చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురౌతుంది. కుటుంబం ఆర్ధికంగా నష్టపోతుంది. చుట్టుపక్కలవారితో ముఖ్యంగా అజ్ఞాత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.
జ్యేష్ఠమాసం మొదటి మంగళవారానికి విశేష మహత్యముంది. ఈ రోజుని పెద్ద మంగళవారం అని కూడా పిలుస్తారు. ఈ రోజున ఎవరికీ డబ్బులు అప్పుగా ఇవ్వవద్దు. ఒకవేళ డబ్బులు అప్పుగా ఇస్తే ఇక తిరిగి వచ్చే పరిస్థితులుండవు. ఈ నెలలో ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్యం బాగుండదు.
హిందూ పంచాంగం ప్రకారం జ్యేష్ఠమాసంలో వెల్లుల్లి, వంకాయ వంటి పదార్ధాలకు దూరంగా ఉండాలి. లేకపోతే ఇంటి దోషం కలుగుతుంది. అదే సమయంలో వేసవి కాలం కావడంతో ఆరోగ్యపరంగా కూడా అంత మంచిది కాదు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జ్యేష్ఠమాసంలో మద్యాహ్నం వేళ ఎట్టి పరిస్థితుల్లోనూ పడుకోకూడదు. లేకపోతే శరీరంలో వివిధ రకాల వ్యాధులు తలెత్తవచ్చు. మద్యాహ్నం సమయంలో ఎండలో బయటకు వెళ్లకూడదు. జేష్ఠమాసంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటున్నందున ఆరోగ్యం పాడైపోతుంది.
జేష్ఠమాసంలో నీటి పొదుపు చాలా అవసరం. నీళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేయకూడదు. ఈ నెలలో నీళ్లకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. నీరు వృధా చేయడం వల్ల ఇంట్లో డబ్బులు కూడా అదే విధంగా దుబారా అయిపోతాయి. ఖర్చులు భారీగా పెరిగిపోయే అవకాశాలున్నాయి. ఇంట్లో దారిద్య్రం ఏర్పడవచ్చు. అందుకే జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి.
Also read: Shani Jayanti 2023: శని జయంతి రోజు ఈ ఉపాయాలు పాటిస్తే శని దోషం, దుష్ప్రభావాల్నించి ఉపశమనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook