Guru Rahu Yuti 2023: 36 ఏళ్ల తర్వాత అద్భుతమైన యాదృచ్చికం.. వీరి జీవితం కష్టాలమయం..

Guru Chandal yogam: సుదీర్ఘ కాలం  తర్వాత గురుడు, రాహువు కలయిక జరిగింది. ఈ రెండు గ్రహాల సంయోగం వల్ల గురు చండాల యోగం రూపొందుతోంది. దీంతో మూడు రాశులవారు చాలా కష్టాలు పడనున్నారు. ఆ అన్ లక్కీ రాశులేవో తెలుసుకోండి.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 3, 2023, 08:32 AM IST
Guru Rahu Yuti 2023: 36 ఏళ్ల తర్వాత అద్భుతమైన యాదృచ్చికం.. వీరి జీవితం కష్టాలమయం..

Guru Rahu Yuti 2023: ఆస్ట్రాలజీలో బృహస్పతిని దేవగురువుగా, రాహువును దుష్ట గ్రహంగా భావిస్తారు. ఏప్రిల్ 22న దేవగురువు బృహస్పతి మీనరాశిని విడిచి మేషరాశిలోకి ప్రవేశించాడు. అప్పటికే రాహువు అక్కడే కూర్చుని ఉన్నాడు. గురువు రాహువు కలయిక వల్ల గురు చండాల యోగం ఏర్పడుతోంది. 36 ఏళ్ల తర్వాత ఈ మహా యాదృచ్ఛికం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని అశుభకరమైనదిగా భావిస్తారు. ఈ యోగ సమయంలో కొన్ని రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

మేషరాశి
ఇదే రాశిలో గురు, రాహువుల కలయిక వల్ల గురు చండాల యోగం ఏర్పడబోతోంది. దీంతో మీరు జీవితంలో అనేక అడ్డంకులు ఎదురవుతాయి. ధన నష్టం కలుగుతుంది. మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. మీరు పని ప్రదేశంలో అప్రమత్తంగా ఉండాలి. 
మిధునరాశి
గురు మరియు రాహువుల కలయికతో ఏర్పడిన గురు చండాల యోగం మిథునరాశి వారికి ఇబ్బందులను కలిగిస్తుంది. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. మీరు భారీగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. మీ ఆదాయం తగ్గే అవకాశం ఉంది. మిమ్మిల్ని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. 

Also Read: Surya Gochar 2023: సూర్యుడి గోచారంతో నెల రోజులపాటు ఈ రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీరాశి ఉందా?

కర్కాటక రాశి
గురు చండాల యోగం కారణంగా మిమ్మల్ని అనేక సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. మీరు శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. ఆఫీసులో సహోద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీకు మీ లైఫ్ లో చాలా కష్టాలను ఎదుర్కోనున్నారు. మీ మాటలను అదుపులో ఉంచుకోండి, లేకపోతే మీకే నష్టం.

Also Read: Surya Guru Yuti 2023: మేషరాశిలో అరుదైన సంయోగం.. ఈ 3 రాశుల వారికి ప్రయోజనం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News