Swiggy Food Delivery: కస్టమర్లకు షాకిచ్చిన స్విగ్గీ.. ఇక నుంచి అదనంగా చెల్లించాల్సిందే..!

Swiggy Platform Fee: ప్రతి ఫుడ్ ఆర్డర్‌పై రూ.2 ప్లాట్‌ఫామ్ ఛార్జీ వసూలు చేస్తున్నట్లు ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది. అయితే ఇన్‌స్టా మార్ట్ వినియోగదారుల నుంచి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని పేర్కొంది. పూర్తి వివరాలు ఇలా..   

Written by - Ashok Krindinti | Last Updated : Apr 30, 2023, 02:50 PM IST
Swiggy Food Delivery: కస్టమర్లకు షాకిచ్చిన స్విగ్గీ.. ఇక నుంచి అదనంగా చెల్లించాల్సిందే..!

Swiggy Platform Fee: ప్రస్తుతం చాలామంది ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఇంట్లో చేసుకునే ఓపికలేని వారు.. బ్యాచ్‌లర్స్ ఇలా చాలామంది జూమాటో, స్విగ్గీ వంటి యాప్స్‌లో ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఆరగిస్తున్నారు. అయితే స్విగ్గీ తన కస్టమర్లకు షాకిచ్చింది. కార్ట్ విలువతో సంబంధం లేకుండా ప్రతి ఫుడ్ ఆర్డర్‌కు రూ.2 ప్లాట్‌ఫారమ్ రుసుమును వసూలు చేయనుంది. ప్రధాన ప్లాట్‌ఫారమ్‌పై మాత్రమే ఫుడ్ ఆర్డర్‌లపై అదనపు ఛార్జీ విధిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇన్‌స్టా మార్ట్ వినియోగదారులకు ఈ ఛార్జీ వర్తించదని వెల్లడించింది. 

ప్లాట్‌ఫారమ్ ఫీజు ఫుడ్ ఆర్డర్‌లపై వసూలు చేసే నామమాత్రపు ఫ్లాట్ రుసుము అని స్విగ్గీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ రుసుము తమ ప్లాట్‌ఫారమ్‌ను నిర్వహించేందుకు.. కస్టమర్లకు మరింత మెరుగ్గా సేవలు అందించేందుకు తమకు సహాయపడతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం స్విగ్గీలో ఒక రోజులో ఒకటిన్నర నుంచి రెండు మిలియన్లకు పైగా ఆర్డర్లు వస్తున్నాయి. ఇటీవల రంజాన్ సందర్భంగా ఒక్క హైదరాబాద్‌లోనే స్విగ్గీలో ఒక మిలియన్ ప్లేట్ల బిర్యానీ, 4 లక్షల ప్లేట్ల హలీమ్‌ను ఆర్డర్ చేయడం విశేషం. 

గత ఏడాదిలో 33 మిలియన్ ప్లేట్ల ఇడ్లీలను డెలివరీ చేసినట్లు స్విగ్గీ వెల్లడించింది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లోనే అత్యధికంగా ఇడ్లీలను ఆర్డర్ చేసినట్లు పేర్కొంది. సగటున స్విగ్గీలో 2.5 లక్షల రెస్టారెంట్ పార్టనర్‌షిప్‌ను కలిగి ఉన్నాయి. సాధారణంగా ప్రతి నెలా దాదాపు 10,000 రెస్టారెంట్లను ఆన్‌బోర్డ్ చేస్తున్నట్లు స్విగ్గీ తెలిపింది. మరోవైపు నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు స్విగ్గీ తెలిపింది. ఈ సంవత్సరం ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ క్విక్ కామర్స్ గ్రోసరీ సర్వీస్ ఇన్‌స్టామార్ట్‌తో చేతులు కలిపి పది వేల ఉద్యోగాలను సృష్టిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. వాణిజ్య డొమైన్ 2025 నాటికి $5.5 బిలియన్లకు చేరుతుందని మార్కెట్ రీసెర్చ్ సంస్థ రెడ్‌సీర్  అంచనా వేసింది. ఇది 2021లో $0.3 బిలియన్ల నుంచి పెరుగుతూ వస్తోంది.  

ఫుడ్ డెలివరీ కోసం 500కి పైగా నగరాల్లో, ఇన్‌స్టామార్ట్ కోసం 25కి పైగా నగరాల్లో ఆన్‌బోర్డింగ్ భాగస్వామ్యాలపై దృష్టిపెడుతున్నట్లు స్విగ్గీ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ కేదార్ గోఖలే వెల్లడించారు. ఎక్కువగా టైర్ 2, 3 నగరాలపై ఫోకస్ పెడుతున్నట్లు చెప్పారు. అప్నాతో భాగస్వామ్యం చిన్న నగరాల్లో ఇన్‌స్టామార్ట్ కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి సహాయ పడిందన్నారు. 

Also Read: Rohit Sharma Birthday: రోహిత్ శర్మ బర్త్‌ డేకు హైదరాబాద్ ఫ్యాన్స్ స్పెషల్ గిఫ్ట్.. 60 అడుగుల భారీ కటౌట్.. కోహ్లీని మించి..!  

Also Read: Punjab Gas Leak: ఘోర విషాదం.. పంజాబ్‌లో గ్యాస్‌ లీక్‌.. 9 మంది మృతి  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News