Healthy Foods: ఆధునిక జీవనశైలి కారణంగా వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలో శరీరంలోని ముఖ్యమైన అంగాలను పరిరక్షించుకోవడం చాలా అవసరం. గుండె ఇందులో కీలకమైంది. గుండెను ఎలా పరిరక్షించుకోవాలో తెలుసుకుందాం..
శరీరంలోని కీలకమైన భాగాల్లో ఒకటైన గుండెను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. లేకపోతే గుండెపోటు ముప్పు పెరుగుతుంటుంది. గుండె ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవాలి. గుండెను పదిలంగా ఉంచేందుకు చాలా మార్గాలున్నాయి. కానీ హెల్తీ డైట్ అనేది అన్నింటికంటే మంచి మార్గం. చెడు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా గుండె అనారోగ్యం పాలవుతుంటుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్, కరోనరీ ఆర్టరీ డిసీజ్, ట్రిపుల్ వెసల్ డిజీస్ వంటివి ఎదుర్కోవల్సి వస్తుంది. గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో పరిశీలిద్దాం..
1. సీడ్స్
ఇటీవలి కాలంలో డైటింగ్ కోసం సీడ్స్ తీసుకోవడం ఎక్కువైంది. సీడ్స్ అనేవి కేవలం డైటింగ్ కోసమే కాకుండా గుండె ఆరోగ్యానికి కూడా దోహదపడతాయి. ఇందులో ఫైబర్, ఫ్లక్స్ సీడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. క్రమం తప్పకుండా రోజూ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
2. కూరగాయలు
సాధారణంగా కూరగాయల్ని హెల్తీ ఫుడ్‌గా పిలుస్తారు. ఆకుపచ్చని కూరగాయలు, పాలకూర, తోటకూర వంటి ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తాయి. డైట్లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
3. బీన్స్
బీన్స్‌లో ఎక్కువ మోతాదులో లభించే రెసిస్టెంట్ స్టార్క్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. జీర్ణక్రియను కూడా ఇది మెరుగుపరుస్తుంది. దాంతోపాటు గుండెను మంచి కండీషన్లో ఉంచుతుంది. అటు కొలెస్ట్రాల్ నియంత్రణలో దోహదం చేస్తుంది.
4. బాదం
మెరుగైన ఆరోగ్యం పొందేందుకు సరళ పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి. బాదం వంటి నట్స్ ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. బాదంలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. గుండె రోగాల్ని నయం చేసేందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి. బాదం క్రమం తప్పకుండా తింటే కొలెస్ట్రాల్ నయమౌతుంది. కొలెస్ట్రాల్ తగ్గితే సహజంగానే గుండెపోటు ముప్పు తగ్గుతుంది.
5. పండ్లు
పండ్లలో బెర్రీస్ చాలా మంచివి. గుండెను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుతాయి. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ బెర్రీ, బ్లాక్ బెర్రీలు ఇందులో ముఖ్యమైనవి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడతాయి.ఇందులో ఉండే ఏంథోసయానిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అటు అవకాడో కూడా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
Also read: Weight Loss Plan: బరువు తగ్గే క్రమంలో తొందర పడి వీటిని తినొద్దు! తింటే అంతే సంగతి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook