Covid cases in India: దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 6,660 కొత్త కొవిడ్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే కేసులు తగ్గుముఖం పట్టాయి. మహమ్మారి కారణంగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో 9, పంజాబ్‌లో నలుగురు, ఢిల్లీలో ముగ్గురు, మధ్యప్రదేశ్, కర్ణాటకలో ఇద్దరు, బీహార్, హర్యానా, రాజస్థాన్, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 3.52%, వీక్లి పాజిటివిటీ రేటు 5.42% గా నమోదైంది. తాజా కేసులతో కరోనా కేసుల సంఖ్య 4.49 కోట్లుకు చేరింది.
తాజాగా ప్రాణాలు కోల్పోయిన వారితో కలిపి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన మరణాల సంఖ్య 5,31,369కి పెరిగింది. మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. దేశంలో 63,380 యాక్టివ్ కేసులు రికార్డయ్యాయి. మొత్తం కోవిడ్-19 కేసుల్లో 0.14%గా ఉన్నాయి. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,43, 11,078కి పెరిగింది. కొవిడ్ రికవరీ రేటు 98.67%గా నమోదైంది. నిన్న దేశంలో 7,178 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదు కాగా.. అంతకు ముందు రోజు 10,112 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి.
Also Read: China: గాల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి ఇండియాకు చైనా రక్షణ మంత్రి
దేశ రాజధాని ఢిల్లీలో 689 కరోనా కేసులు, ముూడు మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 26,600 కు పెరిగింది. మొత్తం కేసుల సంఖ్య 20,34,061కి చేరింది.
Also Read: Madhya Pradesh: కునో నేషనల్ పార్కులో మరో చీతా మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.