SRH vs DC Playing 11: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. తుది జట్లు ఇవే!

SRH vs DC, Delhi Capitals have won the toss and have opted to bat. ఐపీఎల్‌ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనున్నాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : Apr 24, 2023, 07:22 PM IST
SRH vs DC Playing 11: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. తుది జట్లు ఇవే!

IPL 2023 34th Match SRH vs DC playing 11: ఐపీఎల్‌ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ నేడు రాత్రి 7.30కు మొదలవనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ రెండు మార్పలు చేసింది. మరోవైపు 16 మందిలో ఒక మార్పు చేసినట్టు హైదరాబాద్ సారథి ఐడెన్ మార్‌క్రమ్‌ తెలిపాడు. 

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి. హైదరాబాద్‌ ఇప్పటి వరకూ ఆడిన ఆరు మ్యాచ్‌లలో రెండు విజయాలు అందుకోగా.. ఢిల్లీ ఒకే ఒక మ్యాచ్‌లో గెలుపొందింది. ఢిల్లీ అయిదు వరుస ఓటముల అనంతరం గత మ్యాచ్‌లో గెలుపు రుచి చూసింది. దీంతో నేటి మ్యాచ్‌లో విజయం ఇరు జట్లకు కీలకమే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2023లో మరో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది.

తుది జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, హ్యారీ బ్రూక్, ఐడెన్ మార్‌క్రమ్‌ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్ (కీపర్), మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్. 
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (కీపర్), మిచెల్ మార్ష్, మనీష్ పాండే, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, రిపాల్ పటేల్, అన్రిచ్ నార్ట్జే, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌లు:
సన్‌రైజర్స్: నితీష్ రెడ్డి, వివ్రాంత్ శర్మ, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ దాగర్, రాహుల్ త్రిపాఠి.
ఢిల్లీ క్యాపిటల్స్: ముఖేష్ కుమార్, లలిత్ యాదవ్, ప్రవీణ్ దూబే, చేతన్ సకారియా, యశ్‌ ధుల్. 

Also Read: Maruti Suzuki Fronx Price: మారుతి ఫ్రాంక్స్ ధరలు వచ్చేశాయి.. బేస్ వేరియంట్ ధర టాటా నెక్సాన్ కంటే చాలా తక్కువ! 

Also Read: Unknown Facts about Sachin Tendulkar: ఫోన్‌ బిల్స్‌ కట్టలేక అంజలి ఏం చేశారంటే.. సచిన్ గురించి ఎవరికీ తెలియని 10 నిజాలు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News