Pawan kalyan: పవన్ కళ్యాణ్ మరో సంచలనం.. 12 ఎకరాల భూమి కొన్న డిప్యూటీ సీఎం.. కారణం ఏంటంటే..?

Pavan kalyan Land in pithapuram: డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో మళ్లీ 12 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా పవన్ పిఠాపురంలో భూములు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

1 /8

ఇటీవల పవన్ కళ్యాన్ ఏపీలో మహిళలపై జరుగుతున్న దారుణాలపై మండిపడ్డారు. పోలీసులు ఏంచేస్తున్నారని కూడా ఫైర్ అయ్యారు. తాను  హోంమంత్రి అయితే మరో విధంగా ఉంటుందని కూడా పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కాకరేపాయని చెప్పుకోవచ్చు.  

2 /8

ఈ నేపథ్యంలో పవన్ తాజాగా.. సనాతన ధర్మంను కాపాడేందుకు నరసింహా వారిహి బ్రిగేడ్ వింగ్ ను సైతం ప్రారంభించారు. అది కాస్త ప్రస్తుతం ఏపీలోనే కాకుండా బీహార్ లో కూడా దీనిపై రచ్చ నెలకొంది. ఇలాంటి వింగ్ ను దేశమంతట ఏర్పాటు చేయాలని పలువురు కోరినట్లు తెలుస్తోంది.

3 /8

ఇదిలా ఉండగా.. తాజాగా, పవన్ కళ్యాణ్.. పిఠాపురంలో మళ్లీ 12 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ తాను.. పిఠాపురంలోనే ఉంటానని ప్రజలకు మాటిచ్చారు. దాని ప్రకారమే మళ్లీ పవన్ భూమి కొన్నట్లు తెలుస్తోంది.

4 /8

గతంలో కూడా పవన్ భూమిని కొన్న విషయం తెలిసిందే. భోగాపురం రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 2.08 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 

5 /8

ఈనెల 4వ తేదీన పిఠాపురం పర్యటనకు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్​ గతంలోనే కొన్న చోటే మరోసారి ఈ భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం..  

6 /8

పవన్​ కల్యాణ్ భూమి కొనుగోలు చేసిన ప్రాంతంలో ఎకరం సుమారు రూ. 18 లక్షలు పై చిలుకు పలుకుతోందని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మరో 12 ఎకరాల భూమి కొనుగోలు చేయడంతో ఒక్కసారిగా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకొవచ్చు.  

7 /8

రానున్న రోజుల్లో వంగలపూడి అనిత స్థానంలో పవన్ కు హోంమంత్రి పదవీని కూడా ఇచ్చే అవకాశం ఉందని కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా.. యూపీలో యోగి తరహా.. ఏపీలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది.  

8 /8

ఇదిలా ఉండగా..అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ మూడుసార్లు పిఠాపురంలో పర్యటించారు. అక్కడ ఏ సమస్య ఉన్న నేనున్నానంటూ  ప్రజలకు భరోసా సైతం ఇస్తున్నారు.రానున్న రోజుల్లో వంగలపూడి అనిత స్థానంలో పవన్ కు హోంమంత్రి పదవీని కూడా ఇచ్చే అవకాశం ఉందని కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా.. యూపీలో యోగి తరహా.. ఏపీలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది.