MI Vs PBKS Highlights: ముంబై ఇండియన్స్ వరుస విజయాలకు పంజాబ్ కింగ్స్ బ్రేక్ వేసింది. ముంబైను సొంత మైదానంలో 13 పరుగుల తేడాతో మట్టకరిపించింది. పంజాబ్‌కు ఇది నాలుగో గెలుపు కాగా.. రోహిత్ సేనకు ఇది మూడో ఓటమి. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది. ముంబై మెరుపు బ్యాటింగ్‌తో ఒక దశలో విజయం ఖాయమనిపించింది. కానీ చివరి ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సూపర్ బౌలింగ్‌తో రెండుసార్లు స్టంప్‌లను విరగొట్టడం విశేషం.
ముంబై ఇండియన్స్ విజయానికి చివరి రెండు ఓవర్లలో 31 రన్స్ కావాలి. 19వ ఓవర్ నాథన్ ఎల్లిస్ వేశాడు. ఈ ఓవర్ టిమ్ డేవిడ్ ఓ సిక్సర్ బాదగా మొత్తం 15 పరుగులు వచ్చాయి. ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు అవసరం అవ్వగా.. ముంబై జోరు చూస్తే విజయం ఖాయమనిపించింది. క్రీజ్‌లో టిమ్ డేవిడ్‌కు తోడు తిలక్ వర్మ ఉండడంతో ముంబై గెలుస్తుందని అనుకున్నారు. కానీ అర్ష్‌దీప్ సింగ్ సీన్ రివర్స్ చేశాడు. మొదటి బంతికి టిమ్ డేవిడ్ సింగిల్ తీయగా.. తిలక్ వర్మ స్ట్రైక్‌లోకి వచ్చాడు.
రెండో బాల్‌ను డాట్ అవ్వడంతో తిలక్ వర్మపై ఒత్తిడి పెరిగింది. మూడో బంతిని అర్ష్‌దీప్ స్ట్రైట్ యార్కర్ వేయగా.. నేరుగా మిడిల్ స్టంప్స్‌ను విరగొట్టింది. దీంతో పంజాబ్ శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. మూడు బంతుల్లో 15 పరుగులు అవసరం అవ్వగా.. ముంబై ఇంపాక్ట్ ప్లేయర్‌గా నేహాల్ వధీరాను బ్యాటింగ్‌కు పంపించింది. నాలుగో బాల్ కూడా అదే రీతిలో యార్కర్ వేయగా.. మళ్లీ మిడిల్ స్టంప్స్ విరిగిపోయింది. దీంతో పంజాబ్ విజయం ఖాయమైపోయింది. వరుసగా రెండు బంతుల్లో రెండుసార్లు మిడిల్ స్టంప్స్ విరగొట్టిన అర్ష్‌దీప్ ఈ మ్యాచ్‌కు హీరోగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం నాలుగు వికెట్లు తీశాడు.
Probably the most expensive over:
Arshdeep Singh broke the middle stump twice - a set of LED stumps with Zing bails cost 30 Lakhs INR. pic.twitter.com/A0m0EHyGM8
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 22, 2023
ప్రస్తుతం అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదే సమయంలో స్టంప్స్ రేటు గురించి కూడా క్రికెట్ అభిమానులు ఆరా తీస్తున్నారు. ఐపీఎల్‌లో ఎల్‌ఈడీ స్టంప్‌లను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఈ స్టంప్‌ల సెట్ ధర 40 వేల డాలర్లు అంటే దాదాపు 32.81 లక్షలు. అర్ష్‌దీప్ సింగ్ రెండుసార్లు స్టంప్స్ విరగొట్టడంతో బీసీసీఐకి లక్షల్లో నష్టం వచ్చింది. ఐపీఎల్ ఆడుతున్న కొందరు ప్లేయర్ల ధర కంటే స్టంప్స్ రేటే ఎక్కువగా ఉండడం గమనార్హం.
Also Read: Venkatesh Prasad Slams KL Rahul: కేఎల్ రాహుల్‌కి బుర్ర లేదన్న వెంకటేష్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి