JioVoot New OTT: జియో ఇప్పుడు కొత్తగా ఓటీటీ యాప్ లాంచ్ చేస్తోంది. జియో వూట్ పేరుతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లకు పోటీగా వస్తున్న ఈ ఓటీటీ యాప్‌లో ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కూడా లభిస్తుంది. జియో వూట్ ఎలా ఉండనుంది, సబ్స్క్రిప్షన్ ఎంత ఉంటుందనే వివరాలు తెలుసుకుందాం..
రిలయన్స్ జియో లాంచ్ చేస్తున్న కొత్త ఓటీటీ యాప్ పేరు జియో వూట్. ఇందులో లేటెస్ట్ సినిమాలు, క్రికెట్ మ్యాచ్ స్ట్రీమింగ్ ఇలా అన్నీ అందుబాటులో ఉంటాయి. జియో వూట్ నేరుగా మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉండి ప్రాచుర్యం పొందిన ప్రముఖ ఓటీటీ వేదికలు నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్‌లతో తలపడనుంది. అన్నింటికంటే విశేషమేమంటే అతి తక్కువ ధరలో జియో వూట్ సబ్స్క్రిప్షన్ లభించనుంది.
జియో వూట్ నెలవారీ సబ్స్క్రిప్షన్ 99 రూపాయలతో ప్రారంభం కానుంది. దీంతోపాటు జియో బేస్, స్టాండర్డ్, ప్రీమియం ప్లాన్స్ కూడా ఉంటాయి. ఈ ప్లాన్స్‌లో ప్రీమియం ప్లాన్ హై క్వాలిటీ వీడియో కంటెంట్‌తో పాటు ఎక్స్‌క్లూజివ్ ఫీచర్లు అందిస్తుంది. జియో వూట్ వార్షిక సబ్స్క్రిప్షన్ కూడా ఉంటుంది. జియో వూట్ ఎప్పుడు లాంచ్ అయ్యేది అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే ఐపీఎల్ సీజన్ ముగిసిన తరువాత అంటే మే 28 వరకూ లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది.
జియో సినిమా యాప్ పేరును జియో వూట్గా మార్చవచ్చని తెలుస్తోంది. జియో సినిమా యాప్ ప్రస్తుతం ఉచితంగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ఇప్పుడు ఐపీఎల్ 2023 ప్రత్యక్ష ప్రసారం కారణంగా ప్రాచుర్యంలో వచ్చింది. డిమాండ్ పెరిగింది.
Also read: Tata Altroz iCNG: కేవలం 21 వేలతో ఇవాళే బుక్ చేసుకోండి Tata Altroz iCNG, ఫీచర్లు, ధర ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook