Health Tips: ఛాతీలో మంటను నిర్లక్ష్యం చేయవద్దు, ప్రమాదకరవ్యాధికి సంకేతం కావచ్చు

Health Tips: వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా తరచూ వివిధ రూపాల్లో అనారోగ్యం బయటపడుతుంటోంది. ఇందులో ఛాతీలో మంట ప్రధానమైంది. తరచూ ఈ సమస్య ఎదురౌతుంటే నిర్లక్ష్యం వహింకూడదు. ఇది మీకు హాని కల్గించవచ్చు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 18, 2023, 10:03 AM IST
Health Tips: ఛాతీలో మంటను నిర్లక్ష్యం చేయవద్దు, ప్రమాదకరవ్యాధికి సంకేతం కావచ్చు

Health Tips: ఛాతీలో మంట అనేది సాధారణమైన లక్షణమే అయినా..తరచూ అదే పనిగా వస్తుంటే మాత్రం అలక్ష్యం వహించవద్దంటున్నారు వైద్యులు. అదే పనిగా వస్తుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అసలు ఛాతీలో మంట ఎందుకొస్తుంది, ఉపశమనం కోసం ఏం చేయాలో తెలుసుకుందాం..

ఆధునిక జీవనశైలిలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, తిండి వేళలు సరిగ్గా లేకపోవడం, ఫాస్ట్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ వంటివి ఆరోగ్యానికి హని కల్గిస్తుంటాయి. నిద్ర సరిగ్గా లేకపోవడం కూడా మరో కారణం. ఈ కారణాలతో వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఇందులో ప్రధానమైంది ఛాతీలో నొప్పి లేదా మంట. ఈ పరిస్థితి ఉన్నప్పుడు తక్షణం తగ్గించుకునే ఏర్పాట్లు చేసుకోవాలి. నిర్లక్ష్యం వహిస్తే మరింత ప్రమాదకరమౌతుంది.

ఒత్తిడి

ఛాతీలో తరచూ ఎర్పడే మంట లేదా నొప్పికి కారణం ఒత్తిడి కూడా అవుతుంది. ఒత్తిడి అధికమైతే ప్యానిక్ ఎటాక్ ముప్పు ఉంటుంది. హార్ట్ ఎటాక్‌కు కారణమౌతుంది. ఛాతీలో నొప్పి లేదా మంట తరచూ సంభవిస్తుంటే మాత్రం తేలిగ్గా తీసుకోకుండా వైద్యుడిని సంప్రదించాలి.

చెడు ఆహారపు అలవాట్లు

చాలామంది మసాలాలు అధికంగా ఉండే నాన్ వెజ్ ఇష్టపడుతుంటారు. అంతేకాకుండా ఎక్కువమొత్తంలో తింటుంటారు. దీనివల్ల ఛాతీలో మంట సమస్య తలెత్తుతుంది. అందుకే మసాలా పదార్ధాలను వెంటనే డైట్ నుంచి దూరం చేయాలి. బర్గర్ లేదా స్వీట్స్, కూల్ డ్రింక్స్ కూడా ఛాతీలో మంటకు కారణం.

ధూమపానం

స్మోకింగ్ చేసేవారిలో ఛాతీలో మంటతో పాటు ఛాతీ నొప్పి సమస్య. తీవ్రంగా ఉంటుంది. సిగరెట్ స్మోక్ ప్రభావం మీ ఛాతీపై తీవ్రంగా పడుతుంటుంది. ఫలితంగా ఛాతీలో నొప్పి, మంట ఏర్పడుతాయి. అందుకే ఛాతీలో మంట లేదా నొప్పి సమస్య బాధిస్తుంటే వెంటనే స్మోకింగ్‌కు దూరంగా ఉండాలి.

Also read: Legs Tingling: కాళ్లు తిమ్మిరెక్కుతుంటే నిర్లక్ష్యం వద్దు, ప్రమాదకర వ్యాధికి సంకేతం కావచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News