ఉ.కొరియా నియంత లగ్జరీ లైఫ్ స్టైల్ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Last Updated : Oct 30, 2017, 12:01 PM IST
ఉ.కొరియా నియంత లగ్జరీ లైఫ్ స్టైల్ గురించి 10 ఆసక్తికర విషయాలు!

ఒక చిన్న దేశం ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది.. ఎప్పుడు ఏ ఉపద్రవం వస్తుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. దీనికంతటికి కారణం ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ఈయన్ను అందరూ 'నియంత', 'క్షిపణులను నిర్మించాలని కోరుకొనే పిచ్చివాడు',  అని చెబుతారు. కిమ్ గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆయన ఎంత వరకు చదువుకున్నాడు, ఆయన ఆసక్తుల గురించి ఎవ్వరికీ తెలీదు. ఎప్పుడూ ఆయుధాలతో సావాసం చేసే కిమ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

* కిమ్ ఓ స్విస్ స్కూల్ లో విద్యను అభ్యసించారు అని చెబుతారు. 

* కిమ్‌కు ఉత్తరకొరియా మొత్తం మీద 17 ప్యాలెస్‌లు ఉన్నాయి. సొంతంగా ఓ ప్రవేట్ ఐలాండ్‌ కూడా ఉంది.

* ఎనిమిది మిలియన్‌ డాలర్ల విలువైన, 200 అడుగులు పొడవు గల పడవ ఈ నియంత సొంతం.

* సినిమాలు వీక్షించేందుకు 1000 సీట్లతో ప్రత్యేకంగా థియేటర్‌ ఉంది.

* 100కు పైగా కార్లు ఉన్నాయి.

* ఎలాంటి దాడి జరిగిన ప్రాణహాని లేకుండా బయటపడే విధంగా మెర్సిడెజ్‌ కారును  కిమ్‌ ప్రత్యేకంగా తయారు చేయించారు.

* ఎయిర్‌ ఫోర్స్‌ ఉన్‌ పేరుతో కిమ్‌కు ఓ ప్రత్యేక విమానం ఉంది. ఇందులో లెదర్ సోఫాలు, క్రిస్టల్ ఆష్ ట్రే లు అమర్చారు. చూస్తే కళ్ళు తిరగాల్సిందే.

* ప్రవేట్ ప్యాలెస్ అన్నింటిలో విమానం ల్యాండ్, టేక్ ఆఫ్ కు రన్ వే నిర్మించుకున్నారు.

* ఈ ఉత్తర కొరియా నాయకుడు ఖరీదైన ఆల్కాహాల్కు ఇష్టపడతాడు.  స్థానికంగా దొరికే ఆల్కహాల్ ఇష్టం లేకపోతే  ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటాడు.

* లగ్జరీ వాచ్‌లు అంటే కిమ్‌ కు ఇష్టమట. ఎనిమిది మిలియన్‌ డాలర్ల విలువైన వాచ్‌లు కిమ్‌ వద్ద ఉన్నాయి.
 
* మూడు డజన్లకు పైగా పియానోలను కిమ్‌ తన కలెక్షన్‌లో ఉంచుకున్నారు. 

Trending News