Yevam Movie Review: ‘యేవమ్’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..

Yevam Movie Review: చాందినీ చౌదరి ముఖ్యపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘యేవమ్’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా ? లేదా అనేది మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 14, 2024, 08:14 PM IST
Yevam Movie Review: ‘యేవమ్’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..

రివ్యూ: ‘యేవమ్’ (Yevam)
నటీనటులు : చాందినీ చౌదరి, వశిష్ఠ సింహా, జై భారత్, అషు రెడ్డి, యుగంధర్, దేవీ ప్రసాద్ తదితరులు..
సంగీతం : కీర్తన శేష్
ఎడిటర్ : స్రుజన అరుసుమిల్లి
సినిమాటోగ్రఫీ: SV విశ్వేశ్వర్
నిర్మాత :నవదీప్,ప్రకాష్ దంతులూరి
దర్శకత్వం : ప్రకాష్ దంతులూరి
రిలీజ్ డేట్: 14-6-2024

చాందిని చౌదరి లీడ్ రోల్ల్ యాక్ట్ చేసిన సినిమా ‘యేవమ్’. ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో వశిష్ఠ సింహా, అషు రెడ్డి, యుగంధర్ కీలక పాత్రల్లో నటించారు. నవదీప్ నిర్మించిన ఈ సినిమాను ప్రకాష్ దంతలూరి నిర్మించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను మదిని దోచుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..
వికారాబాద్ జిల్లాలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వరుసగా హత్యలు చేస్తుంటాడు. దాన్ని చేధించడానికి అక్కడ పోలీసులు రంగంలోకి దిగుతారు. ఈ క్రమంలో అక్కడ కొత్తగా పోలీస్ డ్యూటీలో ఎస్ఐగా చేరుతోంది సౌమ్య (చాందినీ చౌదరి). ఈ క్రమంలో కొత్త ఛార్జ్ తీసుకున్న సౌమ్య కూడా అమ్మాయిలను చంపుతున్న సైకోను పట్టుకోవడానికి రంగంలోకి దిగుతోంది. ఈ క్రమంలో సౌమ్యకు సైకో నుంచి ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది. చివరకు సైకోను పట్టుకుందా.. ? అసలు ఆ వ్యక్తి సైకోగా మారడానికి గల కారణాలు ఏమిటి ? చివరకు అతన్ని  చట్టానికి అప్పగించిందా లేదా అనేదే ‘యేవమ్’ మూవీ స్టోరీ.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
ఇదో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. బహుశా మనం ఇలాంటి కథలు ఎన్నో చూసుంటాము. అవన్నీ ఈ సినిమా చూస్తుంటే గుర్తుకు వస్తుంటాయి. అదే విధంగా సమాజం తనను సరిగా చూడలేదనే కసితో సైకో మారడం వంటివి కూడా రొటిన్ గా అనిపిస్తాయి. కానీ ఇలాంటి తరహా చిత్రాల్లో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలుంటే ఖచ్చితంగా హిట్ అవుతోంది. దర్శకుడు ప్రకాష్ దంతులూరి తాను రాసిన స్క్రిప్ట్ బాగున్నా.. ఎక్స్ క్యూషన్ లో అక్కడక్కడ తడబడ్డాడు. ఈయనపై గౌతమ్ మీనన్ తో పాటు హాలీవుడ్ దర్శకుల ఇంపాక్ట్ ఉన్నట్టు కనిపించింది. ఇక సైకో అమ్మాయిలను ఎలా ట్రాప్ చేస్తున్నడే విషయాన్ని ఇంటర్వెల్ లో రివీల్ చేసి సినిమా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసాడు. రీసెంట్ గా వచ్చిన సోనాక్షి సిన్హా నటించిన ‘దహద్’ గుర్తుకు వస్తుంది.
అక్కడక్కడ ఈ సినిమాలో తెలంగాణ పల్లె సాంప్రదాయాలను చూపెట్టడం బాగుంది. ఒక మాములు పోలీస్ ఆఫీసర్ ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ను ఎలా చేధించిందనేది ఇంట్రెస్టింగ్ పాయింట్.

కీర్తన శేష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా కథను ఇంకాస్తా విస్తృతంగా రాసుకుంటే బాగుండేది. కథ, స్క్రీన్ ప్లే పరంగా తన మార్క్ చూపించే ప్రయత్నం చేసాడు ప్రకాష్ దంతులూరి. నిర్మాణ పరంగా నవదీప్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు.

నటీనటుల విషయానికొస్తే..

చాందనీ చౌదరి ఓ కామన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోయింది. తన డ్యూటీ భాగంలో సామాజికంగా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందనేది ఈ సినిమాలో చూపించారు. అషు రెడ్డి తన స్కిన్ షోతో హీటెక్కించింది. కన్నడ యాక్టర్ యుగంధర్ తన పాత్రలో ఒదిగిపోయింది. మిగిలిన నటీనటులు పర్వాలేదనిపించారు.

ప్లస్ పాయింట్స్

చాందని చౌదరి నటన

నిర్మాణ విలువలు

ఇంటర్వెల్ బ్యాంగ్

మైనస్ పాయింట్స్

రొటీన్ కథ

స్లో నేరేషన్

లాజిక్ లేని సీన్స్

పంచ్ లైన్.. ‘యేవమ్’ అక్కడక్కడ మెప్పించే క్రైమ్ డ్రామా..

రేటింగ్.. 2.75/5

Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News