VB Entertainment Awards:విష్ణు బొప్పన గారి వీబీ ఎంటర్టైన్మెంట్స్ 2023-2024 యేడాది గాను.. స్మాల్ స్క్రీన్ అవార్డుని ప్రధానం చేసింది. ఈ సందర్భంగా హైద్రాబాద్ లో ఓ ఈవెంట్ ను గ్రాండ్ గా ఆర్గనైజ్ చేశారు. ఈ అవార్డుల ప్రధానోత్సవానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ వేడుకకు వర్చ్యుసా లైఫ్ స్పేసెస్ కి సంబంధించిన వైగండ్ల వెంకటేశ్వర్లు.. వీవీకే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన విజయ్ కుమార్ తో పాటు ఐశ్వర్య సిల్స్క్స్ లక్ష్మి అడ్వకేట్ నాగేశ్వర్ రావు పూజారి హాజరయ్యారు.
మరోవైపు ఈ కార్యక్రమానికి దర్శకులు ఎస్వీ కృష్ణా రెడ్డి, నిర్మాత కే అచ్చిరెడ్డి నిర్మాత కమ్ అంబికా సంస్థల అధినేత అంబికా కృష్ణ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మి నారాయణతో పాటు హీరో ఆకాష్ పూరి, కథానాయిక అర్చన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సూర్యకాంతం, రమాప్రభ తర్వాత సీనియర్ నటి లేడీ స్టార్ కమెడియన్ గా తన కంటూ తెలుగు సినీ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీలక్ష్మికి లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డుతో సత్కరించారు.
వీరే కాకుండా.. టీవీ ఆర్టిస్ట్స్ కి, సోషల్ మీడియా ప్రభావితం చేస్తోన్న వ్యక్తులకు, యూట్యూబర్స్ కి కూడా అవార్డులును ప్రధానం చేశారు. ఈ సందర్బంగా పది మంది పేద కళాకారులకి ఆర్ధిక సాయం కూడా అందించారు.
ఈ సందర్భంగా జీవిత సాఫల్యం పురస్కారం అందుకున్న శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. “వీబీ ఎంటర్టైన్మెంట్స్ స్మాల్ స్క్రీన్ అవార్డు వారికి నా ధన్యవాదాలు తెలిపారు. ఇన్నేళ్ళుగా సినిమాల్లో నటిస్తున్న నన్ను గుర్తించి నాకు ఈ అవార్డు ని అందించారు. ఈ అవార్డును మొదటగా నేను మా గురువు గారైన జంధ్యాల గారికి ఈ అవార్డు అంకితం చేస్తున్నాను. ఆ తర్వాత నేను పని చేసిన డైరెక్టర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పారు. నా మీద ఎప్పటికప్పుడు విశేష ప్రజాదరణ చూపిస్తున్న ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు. మిమ్మల్ని ఇలాగే అలరిస్తూ ఉంటాను. మరొక్క సారి ఇక్కడున్న వారందరికీ వీబీ ఎంటర్టైన్మెంట్స్ కి ధన్యవాదాలు తెలిపారు.
ఈ ఈవెంట్ కి హాజరైన అతిథులందరికీ ఘనమైన స్వాగతం లభించింది. అందరికీ ఏ ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు ఈ వేడుకకు ఎంతో హుందాగా నిర్వహించారు నిర్వాహకులు.
శ్రీలక్ష్మి తో అవార్డ్స్ అందుకున్న వారిలో మానస, వేద, బిగ్ బాస్ ఫేమ్ బేబక్క, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్, దివ్య వాని, రీతూ చౌదరి, బులెట్ భాస్కర్, రామ సత్యనారాయణ, మా అసోషియేషన్ మెంబర్ మాణిక్యం, మాదాల రవి తదితరులున్నారు.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.