Raghav Omkar: తన విజయాన్ని కృష్ణవంశీకి అంకితమిచ్చిన యంగ్ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్..

Raghav Omkar: చిత్ర పరిశ్రమ అనేది ఒక పుష్పక విమానం లాంటిది. ఎంత మంది కొత్తవాళ్లొచ్చినా.. మరొకరికి చోటు ఉంటుంది. ఈ కోవలో తెలుగులో ‘ది 100’ మూవీతో సంచలనం క్రియేట్ చేసిన దర్కుడు ‘రాఘవ్ ఓంకార్’ (Raghav Omkar). ఇప్పటికే పలు అంతర్జాతీయంగా అవార్డులు కొల్లగొట్టిన ఈ దర్శకుడు తన విజయాన్ని క్రియేటివ్ డైరెక్టర్ గా పేరున్న కృష్ణవంశీకి అంకితమిచ్చాడు.

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 18, 2024, 06:37 PM IST
Raghav Omkar: తన విజయాన్ని  కృష్ణవంశీకి అంకితమిచ్చిన యంగ్ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్..

Raghav Omkar: రాఘవ్ ఓంకార్ తెలుగులో బుల్లెట్ గా దూసుకువస్తున్నారు. ఈయన మొగలిరేకులు ఫేమ్ సాగర్ (Sagar) కథానాయకుడిగా ‘ది 100’ మూవీ తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలకు ముందే పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో సత్తా చూపెడుతోంది. ఇప్పటికే ఈ మూవీ గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (Goa International), పారిస్ ఫిల్మ్ అవార్డ్స్ (Paris Film Awards) దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్(Dada Saheb Film Festival)వంటి  పలు ఇంటర్నేషనల్ వేదికలపై సత్తా చాటి రచ్చ గెలిచింది.

తన సినిమాకు వచ్చిన ఈ అవార్డులను తనకు ఇంత పేరు రావడానికి కారణంగా తన గురువు దర్శకుడు కృష్ణవంశీ కారణం అటూ  రాఘవ్ ఓంకార్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ విజయాలన్ని తన గురువుకే అంకితం అన్నారు.  ఈ సందర్భంగా రాఘవ్ ఓంకార్ మాట్లాడుతూ.. తన ఫస్ట్ మూవీ ‘ది 100’ విడుదలకు ముందే అనేక ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ అవార్డులను సాధించింది. ఈ చిత్రాన్ని చూసిన సినీ విమర్శకులు సైతం మెచ్చుకుంటున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ సినిమాలో అర్థవంతమైన కథ, దాని క్యారెక్టర్ లను క్రియేట్ చేయడం వెనక నా గురువు గారైన కృష్ణవంశీ అన్నారు. ఆయన స్పూర్తితోనే ఈ సినిమాను తెరకెక్కించిన విషయాన్ని ప్రస్తావించారు.

కృష్ణవంశీ నుంచి ఓ దర్శకుడిగా నేర్చుకున్న విలువలు.. సినిమా స్క్రీన్ ప్లే పద్దతులు.. ఈ సినిమా విజయం సాధించడంలో కీ రోల్ పోషించాయి. ఈ సినిమా సక్సెస్ ను వందకి వంద శాతం ఆయనకే చెల్లుతుంది. త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందు తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. ఆడియన్స్ కూడా ఈ చిత్రాన్ని విజయ వంతం చేస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. మొత్తంగా ఈ సినిమా విడుదలకు ముందే ఈ రేంజ్ సక్సెస్ సాధించడం వెనక కృష్ణవంశీ ఉన్నారని ముగించారు.

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News