Pailam pilaga movie review: ‘పైలం పిలగా’ మూవీ రివ్యూ.. ఆడియన్స్ ను మెప్పించిందా..!

Pailam pilaga movie review: గత కొన్నేళ్లుగా అంతా కొత్త నటీనటులతో తెరకెక్కిస్తున్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఈ కోవలో వచ్చిన మరో డిఫరెంట్ లవ్ స్టోరీ ‘పైలం పిలగా’. ఈ  రోజు విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ ను మెప్పించిందా..! లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..  

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 20, 2024, 03:42 PM IST
Pailam pilaga movie review: ‘పైలం పిలగా’ మూవీ రివ్యూ.. ఆడియన్స్ ను మెప్పించిందా..!

చిత్రం  : పైలం పిలగా (Pilam Pilaga)
నటీనటులు: సాయి తేజ కల్వకోట, పావని కరణం, సతీష్ సారిపల్లి, చిత్రం శ్రీను,మిర్చి కిరణ్, డబ్బింగ్ జానకి, ప్రణవ్ సోను తదితరులు
సంగీత దర్శకుడు: యశ్వంత్ నాగ్
ఎడిటింగ్: రవితేజ
సినిమాటోగ్రాఫర్: సందీప్ బద్దుల
నిర్మాత: ఎస్.కే.శ్రీనివాస్,రామకృష్ణ బొద్దుల
దర్శకత్వం: ఆనంద్ గుర్రం
విడుదల: 20-09-2024

సాయి తేజ కల్వకోట హీరోగా, పావని కరణం హీరోయిన్ గా నటించిన చిత్రం ‘పైలం పిలగా’. హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్ లో తొలి చిత్రంగా ఈ సినిమా తెరకెక్కింది.  రామకృష్ణ బొద్దుల, ఎస్.కే. శ్రీనివాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. యశ్వంత్ నాగ్ సంగీతాన్ని అందించారు.  సందీప్ బద్దుల కెమెరామెన్ పనిచేసారు. రవి వాషింగ్టన్, కృష్ణ మసునూరి, విజయ్ గోపు సహా నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా సెప్టెంబర్ 20న థియేటర్స్ లో రిలీజైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా.. మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ:
సాయి తేజ కల్వకోట (శివ) మన దేశంలో కంటే దుబాయ్ వెళితే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చని అనుకుంటాడు. దుబాయి వెళ్లడానికి  శివ నాయనమ్మకు ఊర్లో కొంత జాగా ఉంటుంది. అది అమ్మి దుబాయి వెళ్దామనుకుంటాడు. ఈ  క్రమంో అతని జిగ్రి దోస్తు ప్రణవ్  సోను (శ్రీను)తో కలిసి ఊర్లో ఉన్న జాగా అమ్ముదామనుకుంటాడు. కానీ స్థలం లిటిగేషన్ లో ఉంటుంది. ఈ క్రమంలో దేవి (పావని కారణం ) శివ లవ్ చేస్తాడు. లాస్ట్ కు  శివ దేవిని పెళ్లి చేసుకున్నాడా ? ఈ క్రమంలో దుబాయ్ వెళ్లాలనుకున్న శివ ప్లాన్ ఏమయ్యిందనేదే ఈ సినిమా స్టోరీ.  

విశ్లేషణ:
తెలంగాణలో పైలం అంటే జాగ్రత్తగా ఉండమని అర్ధం. అంటే ఏదైనా పని చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాలనే ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టాడు దర్శకుడు. 'పిల్ల పిలగాడు' వెబ్ సిరీస్ తో యువతో మంచి క్రేజ్ సంపాదించుకున్న సాయి తేజ హీరోగా, పుష్ప , పరేషాన్ చిత్రాలతో వెలుగులోకి వచ్చిన పావని కరణం కథానాయికగా ,యాడ్ ఫిలిం మేకర్ ఆనంద్ గుర్రం డైరెక్షన్ లో ఈ మూవీ.  దర్శకుడు ప్రస్తుతం మన సమాజంలో విదేశాలకు వెళితే.. ఈజీగా బతికేయచ్చని చాలా మంది ఆలోచనలకు దృశ్య రూపమే ఈ సినిమా. ప్రస్తుతం చాలా మంది దుబాయి, అమెరికా అంటూ సరైన విద్య లేకుండా అక్కడికి వెళ్లి అడ్డంగా ఇరుక్కుపోతున్నారు. అలాంటి వాళ్లకు కనువిప్పు కలిగేలా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

ముఖ్యంగా పైసాను ప్రేమించే పిలగాడు, ప్రకృతిని ప్రేమించే పిల్ల. గాల్లో మేడలు కట్టుకోని రాత్రికి రాత్రి కోటీశ్వరుడు కావాలనే  కలలు కనే యవకుడు. చెట్టు కింద చిన్న గూడు చాలు అనుకునే అమ్మాయి మధ్య ప్రేమ ఒకవైపు, ఎక్కడికైనా సరే,ఎంత దూరమైనా సరే వెళ్లి కోట్లు సంపాదించి తన ఊళ్ళో కింగ్ అనిపించుకోవాలనే యువకుడి ఆరాటాన్ని ఈ సినిమాలో చూపించిన విధానం బాగుంది. ఈస్ట్ వెస్ట్ సంఘర్షణని ఎంతో హృద్యంగా  హాస్యభరిత వ్యంగ చిత్రంగా ప్రేక్షకుల ముందు ఉంచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

డైరెక్టర్ ఆనంద్ గుర్రం రాసుకున్న కథ కథనాలు హిల్లేరియస్ సాగుతూనే ఆలోచింపజేస్తాయి. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అంశాలనే తన సినిమాకు వస్తువవుగా తీసుకున్నాడు. ఏది ఏమైనా దర్శకుడిగా ఫస్ట్ అటెంప్ట్ లోనే  సక్సెస్ సాధించాడు. మ్యూజిక్ డైరెక్టర్ యస్వత్ నాగ్ సంగీతం ఈ సినిమాకు మరో హైలెట్.

నటీనటులు విషయానికొస్తే..
కొత్త నటీనటులైన ఎక్కడా కొత్తవాళ్లలా కాకుండా.. పక్కంటి అమ్మాయి, కుర్రాడిలా నటించిన తీరు ఆకట్టుకుంటుంది. సహాయ పాత్రల్లో నటించిన నటీనటులు నటనకు ఈ సినిమాకు ప్లస్ అని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటి యూత్ తప్పక  చూడాల్సిన సినిమా పైలం పిలకా.

పంచ్ లైన్.. హిల్లేరియస్ ‘పైలం పిలగా’

రేటింగ్.. 2.75/5

ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..

ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News