Nenu Keerthana Movie Review:‘నేను కీర్తన’ మూవీ రివ్యూ.. మెప్పించిందా..!

Nenu Keerthana Movie Review: చిత్ర పరిశ్రమలో ఎప్పటికపుడు కొత్త కథానాయకులు పరిచయం అవుతూనే ఉన్నారు. ఈ రూట్లలోనే ‘నేను - కీర్తన’ మూవీతో చిమటా రమేశ్ బాబు హీరోగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.  తాజాగా ఈయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘నేను కీర్తన’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 30, 2024, 07:16 PM IST
 Nenu Keerthana Movie Review:‘నేను కీర్తన’ మూవీ రివ్యూ.. మెప్పించిందా..!

నటీనటులు: రమేష్ బాబు, రిషిత, మేఘన,జీవా, మంజునాథ్, విజయ్ రంగరాజు, రేణుప్రియ, సంధ్య జబర్దస్త్ అప్పారావు తదితరులు..
సినిమాటోగ్రఫీ: కె.రమణ
ఎడిటర్: వినయ్ రెడ్డి బండారపు
మ్యూజిక్: ఎమ్.ఎల్.రాజా
బ్యానర్; చిమటా ప్రొడక్షన్స్
సమర్పణ: చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ)
నిర్మాత: చిమటా లక్ష్మీ కుమారి
రచన - దర్శకత్వం: చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్)
విడుదల తేది: 30-8-2024

ఈ మధ్యకాలంలో బడా సినిమాలకు పోటీగా వార్తల్లో అందరిని అట్రాక్ట్ చేసిన చిత్రం ‘నేను కీర్తన’. ఈ సినిమాకు కథ - మాటలు - స్క్రీన్ ప్లే .. డైరెక్షన్ తో పాటు హీరోగా నటిస్తూ చిమటా రమేష్ బాబు చేసిన ఈ సినిమా నేడు విడుదలైంది. మరి ఈ సినిమాతో చిమటా రమేష్ తొలి ప్రయత్నంలోనే హీరోగా, దర్శకుడిగా సత్తా చూపెట్టాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..

జానీ (చిమటా రమేష్ బాబు) ఆపదలో ఉండి  తన సాయం కోరి వచ్చిన వారికీ ఏం చేయడానికైనా వెనకాడని మనస్తత్వం ఉన్న వ్యక్తి.   ఈ క్రమంలో అతనికి ఎంతో మంది శతృవులు తయారువుతారు. ఈ క్రమంలో అతని జీవితంలో కీర్తన అనే అమ్మాయి ప్రవేశించాకా అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది. ఈ క్రమంలో అతనికి లభించిన ఓ వరాన్ని తన వ్యక్తిగతంగా కాకుండా సమాజ ప్రయోజనాలకు అనుగుణంగా జానీ ఏ విధంగా వినియోగించుకున్నాడన్నదే ఈ సినిమా స్టోరీ.  

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
హీరోగా తొలి ప్రయత్నంలోనే డిఫరెంట్ సబ్జెక్ట్ ను రెడీ చేసుకోవడం మాములు విషయం కాదు. అంతేకాదు ఇలాంటి మాస్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ను తానే డైరెక్ట్ చూస్తూ కథ, స్క్రీన్ ప్లే సమకూర్చడం మాములు విషయం కాదు. అంతేకాదు తాను రాసుకున్న కథలో అన్ని రకాల ఎమోషన్స్ ఉండేలా జాగ్రత్త తీసుకున్నాడు. మొత్తంగా తొలి ప్రయత్నంలోనే  లవ్ సబ్జెక్ట్ తో పాటు సెంటిమెంట్, యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామాతో పాటు కామెడీని పండించాడు. అదే రేంజ్ లో  రివెంజ్, హర్రర్ వంటి అంశాలన్ని మిక్స్ చేసి తెరకెక్కించడం మాములు విషయం కాదు. అక్కడక్కడ తడపడ్డ హీరోగా, దర్శకుడిగా తాను అనుకున్న కథను తెరకెక్కించడంలో ఎక్కడా రాజీ పడలేదు.  ఒక మాములు సినిమాలో ఇన్ని జోనర్స్ మిక్స్ చేయడం హీరోగా, దర్శకుడిగా చిమటా రమేష్ బాబు గట్స్ ఏంటో చెప్పకనే చెప్పింది. మొత్తంగా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో ఈ సినిమాను తీర్చిదిద్దాడు. మరి ప్రేక్షకులు ఈ ప్రయత్నాన్ని ఏ మేరకు ఆదరిస్తారనేది చూడాలి.

తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా రమేష్ బాబు ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. కథతో పాటు స్క్రీన్ ప్లే ఇంకాస్త పకడ్బందిగా రెడీ చేసుకొని ఉంటే ఔట్ పుట్ ఇంకాస్త బెటర్ గా వచ్చేంది.  తొలి ప్రయత్నంలోనే అన్ని శాఖలతో పాటు అన్ని జానర్స్ ను టచ్ చేయడం కొంత ఓవర్ అనిపించినా.. నటుడిగా, దర్శకుడిగా చిమటా రమేష్ బాబు కాన్ఫిడెన్స్ లెవల్స్ ను చూపిస్తోంది.  ఎడిటింగ్ ఇంకాస్త ట్రిమ్ చేసుంటే బాగుండేది.  బడ్జెట్ పరిమితులు దృష్టిలో పెట్టుకుంటే కెమెరా వర్క్ చాలా బాగున్నట్లే. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎం.ఎల్.రాజా బాణీలు, ముఖ్యంగా నేపధ్య సంగీతం పర్ఫెక్ట్ గా సెట్ అయింది.  

నటీనటుల విషయానికొస్తే..

హీరో రమేష్ బాబు దర్శకుడిగా తనను తాను హీరోగా ప్రమోట్ చేసుకున్న విధానం బాగుంది. తొలి సినిమాలోనే ఎంతో మెచ్యురిటీ ఉన్న నటుడిగా మెప్పించాడు.  అంతేకాదు ఫైట్స్, డాన్స్ లలో మంచి ఈజ్ చూపించాడు.  కాకపోతే, రైటర్, డైరెక్టర్ కూడా తనే అయిన రమేష్ బాబు... పెద్ద హీరోలకయితే బ్రహ్మాండంగా పేలే డైలాగ్స్ రాసుకోవడం చెప్పుకోదగ్గ అంశం. విజయ రంగరాజు, జీవాల విలనిజం  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  జబర్దస్త్ అప్పారావు కామెడీ బాగానే పండింది. కొత్తవాళ్ళయినా హీరోయిన్లు రిషిత, మేఘన తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించి మెప్పించారు.

రేటింగ్ :2.5/5

ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News