Lakshmi Kataksham: ఆసక్తిరేకిస్తోన్న ఓటుకు 5000 అంటూ 'లక్ష్మీ కటాక్షం' ట్రైలర్..

Lakshmi Kataksham: తెలుగులో ఈ మధ్య కాలంలో డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలకు మంచి ఆదరణ పెరిగింది. ఈ కోవలో వస్తోన్న మరో చిత్రం 'లక్ష్మీ కటాక్షం'. తాజాగా విడుదలైన  ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.

Last Updated : Apr 19, 2024, 03:25 PM IST
Lakshmi Kataksham: ఆసక్తిరేకిస్తోన్న ఓటుకు 5000 అంటూ  'లక్ష్మీ కటాక్షం' ట్రైలర్..

Lakshmi Kataksham: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎలక్షన్ సీజన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో వస్తోన్న మరో డిఫరెంట్ చిత్రం  'లక్ష్మీ కటాక్షం'. మహతి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై యు. శ్రీనివాసులు రెడ్డి, బి.నాగేశ్వర రెడ్డి, వహీద్ షేక్, కే.పురుషోత్తం రెడ్డి నిర్మించారు.
ఈ సినిమా ట్రైలర్‌లో ఓపెనింగ్ లోనే ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎలక్షన్స్ డేట్ నే సినిమాలో ఎలక్షన్ డేట్ లాగా అనౌన్స్ చేశారు.  ప్రముఖ నటుడు డైలాగ్ కింగ్ సాయి కుమార్ తన పాతికేళ్ళ పొలిటికల్ కెరీర్ ను నిలబెట్టుకోవడం కోసం ఈ ఎలక్షన్ ను చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకుంటాడు.  మరో పక్క పోలీస్ ఆఫీసర్ ఎలాగైనా ఈ ఎలక్షన్ లో ఒక్క రూపాయి కూడా పంచకుండా చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఆ పోలీస్ బందోబస్త్ నుండి, తక్కువ టైంలో 100 కోట్లని, రెండు లక్షల మంది ఓటర్లకు, ఓటుకు 5000 చొప్పున ఎలా పంచుతారు అనే నేపధ్యంలో సినిమా కథ ఉండబోతున్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.  కామెడీ తో పాటు హూకింగ్ డ్రామా కూడా ఉంది ఈ ట్రైలర్ లో.

 

ఒక పక్క సాయి కుమార్ కి ఎలక్షన్ ఫండ్ రావడం ఒక ఛాలెంజ్ అయితే.. ఇంకో పక్క లాస్ట్ మినిట్ లో వచ్చిన ఫండ్ ఎలా పంచాలి అనేది ఇంకో టాస్క్..  ఈ తరుణంలో చిరాకు పడి అన్ని దారులు మూసుకున్న సాయి కుమార్ లక్ష్మీ దేవిని ఎలక్షన్ ఫండ్ కటాక్షించమని డిమాండ్ చేస్తారు.  లక్ష్మి దేవి ప్రత్యేక్షమవుతారు. ఇలాంటి  డిఫరెంట్ కాన్సెప్ట్‌తో  సాగే ఈ ‘లక్ష్మీ కటాక్షం’ త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. ఈ సినిమాకి సూర్య రైటర్‌గా.. డైరెక్టర్ గా ఈ సినిమాను విడుదల చేశారు.  ట్రైలర్ లో డ్రామా పర్ఫెక్ట్ గా హైలైట్ అయ్యేలా మ్యూజిక్ అభిషేక్ రుఫుస్ అందించారు. ఈ సినిమాలో సాయి కుమార్ కాకుండా ఇతర ముఖ్యపాత్రల్లో వినయ్, అరుణ్, దీప్తి వర్మ, చరిష్మా శ్రీకర్, హరి ప్రసాద్, సాయి కిరణ్ ఏడిత, ఆమని నటించారు.

Read More: Venomous Snakes Facts: పాముల గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News