Love Me Movie Review:'లవ్ మీ' మూవీ రివ్యూ.. మెప్పించిందా..!

Love Me Movie Review: ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా దిల్ రాజు(Dil Raju) ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కిన చిత్రం 'లవ్ మీ'. ఈ రోజు విడుదలైన ఈ హార్రర్ థ్రిల్లర్ ప్రేక్షకులను మెప్పించిందా ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : May 25, 2024, 02:00 PM IST
Love Me Movie Review:'లవ్ మీ' మూవీ రివ్యూ.. మెప్పించిందా..!

మూవీ రివ్యూ: లవ్ మీ (Love Me)
నటీనటులు: ఆశిష్,వైష్ణవి చైతన్య, సిమ్రాన్ చౌదరి,రాజీవ్ కనకాల, రవికృష్ణ తదితరులు
కెమెరామెన్: పీసీ శ్రీరామ్
మ్యూజిక్: ఎం.ఎం.కీరవాణి
నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి, నాగ మల్లిడి
నిర్మాణం: దిల్ రాజు ప్రొడక్షన్స్
రచన, దర్శకత్వం: అరుణ్ భీమవరపు

ఆశిష్, వైష్ణవి చైతన్య జోడిగా దిల్ రాజు(Dil Raju) ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కిన చిత్రం 'లవ్ మీ'. హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని అరుణ్ దర్శకత్వం వహించారు. ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాకు PC శ్రీరామ్ సినిమాటోగ్రాఫీ అందించిన ఈ సినిమా నేడు థియేటర్స్‌లో విడులైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

స్టోరీ విషయానికొస్తే..

సినిమా స్టార్ట్ అవుతూనే..  ఓ చిన్న ఊరు.. అందులో అందరమైన కుటుంబం. ఆ  ఫ్యామిలీలో భార్య, భర్త కన్నుమూయడం.. వాళ్ళ పాప అనాథగా మిగలడంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఇక మెయిన్ స్టోరీలోకి వచ్చాకా.. అర్జున్(ఆశిష్), ప్రతాప్(రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలు, స్మశానాలలకు సంబంధించిన వీడియోలు చేస్తూ ఉంటారు. ప్రతాప్ గర్ల్ ఫ్రెండ్ ప్రియా(వైష్ణవి చైతన్య) వీళ్లతో కలిసి వర్క్ చేస్తూ ఉంటుంది. ఓ రోజు సినిమా స్టార్టింగ్‌లో  చూపించిన పాప గురించి న్యూస్ అర్జున్ దగ్గరికి రావడంతో ప్రతాప్, ప్రియా రీసెర్చ్ చేసి ఆ పాప పెద్దయ్యాక చనిపోయి దివ్యవతి అనే దెయ్యం అయిందనే విషయం కనుగొంటారు. ఆ దయ్యాన్ని చూడటానికి వెళ్లిన వాళ్ళందర్నీ చంపేస్తుందని చెబుతారు. దీంతో అర్జున్ అసలు ఆ దెయ్యం కథేంటో చూద్దామని వెళ్లి ఆ దయ్యంతో ప్రేమలో పడతాడు. కానీ అక్కడ ఓ అమ్మాయి ఉందని గ్రహించి మరి చనిపోయింది ఎవరు? అసలు దివ్యవతి ఎవరు అని రీసెర్చ్ చేస్తుంటే మరో ముగ్గురు అమ్మాయిలు చనిపోయినట్టు తెలియడంతో వాళ్ళకి దివ్యవతికి లింక్ ఏంటి అని అర్జున్ వెతకడం ప్రారంభిస్తాడు. అసలు దివ్యవతి ఎవరు? ఆ ముగ్గురు ఎలా చనిపోయారు? అర్జున్ దయ్యాన్ని ఎందుకు ప్రేమించాల్సి వచ్చింది? ఆ పాపకి దివ్యవతికి సంబంధం ఉందా? చివరకు దెయ్యం అర్జున్ ని ఏం చేసిందనేది తెలియాలంటే సిల్వర్ స్క్రీన్‌ పై  చూడాల్సిందే.                

కథనం, విశ్లేషణ..
సినిమా స్క్రీన్ ప్లే దెయ్యమే కథ చెబుతున్నట్టు ఆసక్తికరంగా రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్‌ అంతా అర్జున్, దివ్యవతి గురించి వెతుకుతూ వెళ్లడం.. అక్కడ దెయ్యం సీన్స్‌తో సాగుతుంది. మొత్తంగా ఇంటర్వెల్‌కి ఓ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి నెక్ట్స్ ఏంటనేది ఇంట్రెస్టిగ్ క్రియేట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇక సెకండ్ హాఫ్ లో ఆ ముగ్గురు అమ్మాయిల గురించి, దివ్యవతి గురించి అర్జున్ చేసే రీసెర్చ్‌ను ఆసక్తికరంగా మలిచాడు. ఇక క్లైమాక్స్‌లో  వరుస ట్విస్ట్ లు, మళ్ళీ చివర్లో సెకండ్ పార్ట్ కి లీడ్ ఇస్తూ ఇంకో ట్విస్ట్ తో  ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ముందు నుంచి ప్రమోషన్స్ లో చెప్పినట్టు సినిమాలో ఐదారుగురు హీరోయిన్స్ ఉన్నారు. వైష్ణవి, సిమ్రాన్ కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరు, వాళ్ళ పాత్రలేమిటనే విషయమే ఈ సినిమాకు మెయిన్ హైలెట్.

టెక్నికల్ విషయానికొస్తే.. 

PC శ్రీరామ్ కెమెరామెన్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి దృష్యాన్ని అందంగా తన కెమెరాలో బంధించడం శ్రీరామ్ మార్క్ స్టైల్. ఈ సినిమాకు పీసీ శ్రీరామ్ ఫోటోగ్రఫీ బిగ్ ఎస్సెట్. ఆస్కార్ విన్నర్ కీరవాణి ఈ సినిమాకు  అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. BGM తోనే భయపెట్టారు. పాటలు పర్వాలేదు. ఆర్ట్ డైరెక్టర్ లొకేషన్స్ ని చాలా బాగా డిజైన్ చేసారు. కొత్త కథకి ఓ కొత్త కథనంతో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చి దర్శకుడిగా ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టాడనే చెప్పాలి.  

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఆశిష్ రౌడీ బాయ్స్ లో కాలేజీ కుర్రాడిగా ఫుల్ ఎనర్జిటిక్ గా నటించి మెప్పించాడు. ఈ సినిమాలో అదే ఎనర్జీతో తెరపై ఫ్రెష్‌గా కనబడింది. బేబీతో అందర్నీ ఇంప్రెస్ చేసిన వైష్ణవి చైతన్య మరోసారి ఈ సినిమాతో ప్రేక్షకులని మెప్పించింది. రవికృష్ణ కూడా ఆశిష్ కి బాగా సపోర్ట్ ఇస్తూ నటించాడు. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.
 
ప్లస్ పాయింట్స్

కథ

సినిమాటోగ్రఫీ

ఇంటర్వెల్ ట్విస్ట్

మైనస్ పాయింట్స్

ఫస్ట్ హాఫ్  ల్యాగ్

లాజిక్ లేని సీన్స్

లాస్ట్ పంచ్.. 'లవ్ మీ' ఆకట్టుకునే హార్రర్ థ్రిల్లర్..

రేటింగ్: 2.75/5

Read more: Hyderabad Pothole: హ్యాట్సాఫ్.. మహిళ చేసిన పని సర్కారునే దిగొచ్చేలా చేసింది.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News