Honeymoon Express Pre Release Event: విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా ‘హనీమూన్ ఎక్స్ ప్రెస్ ప్రీ రిలీజ్ ఈవెంట్’..

Honeymoon Express Pre Release Event: హెబ్బా పటేల్, చైతన్య రావు జంటగా యాక్ట్ చేస్తోన్న సినిమా "హనీమూన్ ఎక్స్ ప్రెస్".  న్యూ రీల్ ఇండియా బ్యానర్ పై కేకేఆర్, బాలరాజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ  చిత్రాన్ని ప్రయోగాత్మకంగా ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ కామెడీ గా దర్శకుడు బాల రాజశేఖరుని డైరెక్ట్ చేశారు. ఈ  నెల 21 విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా  జరిగింది.

Last Updated : Jun 14, 2024, 07:59 AM IST
Honeymoon Express Pre Release Event: విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా ‘హనీమూన్ ఎక్స్ ప్రెస్ ప్రీ రిలీజ్ ఈవెంట్’..

Honeymoon Express Pre Release Event: హెబ్బా పటేల్, చైతన్య రావు జంటగా న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్టేనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా నటుడు
కేఎల్ ప్రసాద్ మాట్లాడుతూ - హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా కంటెంట్ సరికొత్గా ఉంది. ఈ జనరేషన్ ఆడియన్స్ ఈ సినిమాను ఇష్టపడే సినిమాగా చెప్పొచ్చు. హీరో హీరోయిన్స్ చైతన్య రావ్, హెబ్బా పటేల్ కు, డైరెక్టర్ బాల కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

దర్శకుడు దశరథ్ మాట్లాడుతూ - దర్శకుడు బాల రాజశేఖరునితో నాకు మంచి మిత్రుడు. ఆయన హాలీవుడ్ లో బ్లైండ్ యాంబిషన్, గ్రీన్ కార్డ్ ఫీవర్ అనే మూవీస్ చేశారు. ఇప్పుడు టాలీవుడ్ కు వచ్చి ‘హనీమూన్ ఎక్స్ ప్రెస్’ సినిమా తెరకెక్కించారు. హీరో చైతన్య రావ్ నాకు మంచి  స్నేహితుడు. ఈ మూవీకి కల్యాణి మాలిక్ మంచి సాంగ్స్ ఇచ్చారు. ఈ నెల 21న థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు.

దర్శకుడు, నటుడు అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ - నేను యూఎస్ లో ఉన్నప్పుడు మా ఫేవరేట్ డైరెక్టర్స్ ను ఈమెయిల్స్ ద్వారా సంప్రదించేవాడిని. అలా డైరెక్టర్ బాల గారిని అప్రోచ్ అయ్యాను. ఆయన మూవీకి పనిచేయాలని ఉందని అడిగాను. బాల తెరకెక్కించిన ‘బ్లైండ్ యాంబిషన్2 సినిమాకు ఒక షెడ్యూల్ అయ్యాక జాయిన్ అయ్యాను. అలా నేను ఫస్ట్ నేను వర్క్ చేసిన మూవీ ఆయనదే. స్క్రిప్ట్ రైటింగ్ లో మంచి బుక్స్ ను బాల నాకు సజెస్ట్ చేసేవారని గుర్తు చేశారు. అలా స్క్రిప్ట్ రైటింగ్ లోనూ అవగాహన తెచ్చుకున్నా. బాల తెలుగులో తన తొలి సినిమాను హనీమూన్ ఎక్స్ ప్రెస్ పేరుతో చేయడం సంతోషంగా ఉందన్నారు.  

హీరోయిన్ హెబ్బా పటేల్ మాట్లాడుతూ - హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి సపోర్ట్ చేసిన అతిథులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాతో ఎగ్జైటింగ్, ఇంట్రెస్టింగ్ ప్రయాణం  చేశాము. ఈ నెల 21న హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా రిలీజ్ అవుతోంది. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారన్న నమ్మకం ఉందన్నారు.  

దర్శకుడు బాల రాజశేఖరుని మాట్లాడుతూ - హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి ఆశీర్వదించిన  అతిథులు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. మా మూవీకి నాగార్జున, అమల, రాఘవేంద్రరావు, ఆర్జీవీ, విజయేంద్రప్రసాద్..ఇలా చాలామంది సపోర్ట్ చేస్తూ మా ప్రయత్నానికి అండగా నిలిచారు. నాగార్జున ముందు ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రమోషన్ కు అమల ముందుకొచ్చారు. వారు ఇచ్చిన ఎంకరేజ్ మెంట్ తో హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా సక్సెస్ ఫుల్ గా మీ ముందుకు తీసుకొస్తున్నామన్నారు. మనదేశం నుంచి దూరంగా ఉంటూ రావడం వల్ల ఇక్కడి ప్రజలను, సంస్కృతిని మిస్ అయ్యాను.ఈ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు.

రైటర్ విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ - హనీమూన్ ఎక్స్ ప్రెస్ మూవీ జంట చైతన్య రావ్, హెబ్బా పటేల్ కెమిస్ట్రీ బాగుంది.  దర్శకుడు బాల మంచి డైరెక్టర్. హాలీవుడ్ లో మూవీస్ చేశాడు. ఇప్పుడు తెలుగులో దర్శకుడిగా అడుగుపెడుతున్నాడు. ఈ సినిమా తప్పక విజయం సాధిస్తందనే నమ్మకం వ్యక్తం చేశారు.

హీరో చైతన్య రావ్ మాట్లాడుతూ - ప్రతి నటుడికి అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న పాత్ర  చేయాలనే అభిలాష ఉంటుంది. నాకు అలాంటి ఛాన్స్ హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా ద్వారా దక్కడం తన అదృష్టమన్నారు. దర్శకుడు బాలలలో హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ఉంటుంది. ఈ సినిమాలోనూ అది కనిపిస్తుంది. డైరెక్టర్ బాల ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడే హ్యాపీగా ఫీలయ్యాను.  ప్రేక్షకులు ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నిషియన్ అద్భుతంగా పనిచేశారన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రసాద్ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్, తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.

Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News