Honeymoon Express: హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న "హనీమూన్ ఎక్స్ ప్రెస్.. స్క్రీన్స్ పెంపు..

Honeymoon Express Succes Meet: హెబ్బా పటేల్, చైతన్య రావు హీరో, హీరోయిన్లుగా సుహాసిని, తనికెళ్ల భరణి ఇతర లీడ్ రూల్స్ లో యాక్ట్ చేసిన సినిమా ‘హనీమూన్ ఎక్స్ ప్రెస్’. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అంతేకాదు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 22, 2024, 04:09 PM IST
Honeymoon Express: హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న "హనీమూన్ ఎక్స్ ప్రెస్.. స్క్రీన్స్ పెంపు..

Honeymoon Express Succes Meet: హెబ్బా పటేల్, చైతన్య రావ్ జోగి యాక్ట్ చేసిన సినిమా ‘హనీమూన్ ఎక్స్ ప్రెస్’. ఈ ఫ్రైడే విడుదలైన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ తో థియేటర్ల సంఖ్య పెంచుకుంటూ వెళుతున్నారు. 50 స్క్రీన్ తో నిన్న రిలీజైన ‘హనీమూన్ ఎక్స్ ప్రెస్’ సినిమా అదే రోజు 70 స్క్రీన్ కు చేరింది. టాక్ బాగుండటంతో బీ, సీ సెంటర్ లో డిస్ట్రిబ్యూటర్స్ సినిమా రిజల్ట్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  బీ, సీ సెంటర్ లో కొత్త థియేటర్స్  ఈ మూవీకి యాడ్ అవుతున్నాయి. ‘హనీమూన్ ఎక్స్ ప్రెస్’ సినిమాలో దర్శకుడు బాల రాజశేఖరుని చూపించిన ఇన్నోవేటివ్ కాన్సెప్ట్, కథను తెరకెక్కించిన విధానం, ప్రస్తుతం యూత్ ఫేస్ చేస్తోనన్న ప్రాబ్లెమ్స్ తీసుకొని తనదైన శైలిలో స్టోరీని అందరికీ నచ్చేలా ప్రెజెంట్ చేసిస విధానం ఆకట్టుకుంటోంది.

క్రిటిక్స్ నుంచి కూడా ఈ సినిమాకు ప్రశంసలు కురిపిస్తున్నారు. మూవీ లోని నాలుగు పాటలు బాగున్నాయనే పేరొచ్చింది. హెబ్బా పటేల్, చైతన్య రావ్ జంట ఆడియన్స్ కు ఫ్రెష్ గా అనిపించింది. సెకండాఫ్ లో  వచ్చే వీరి రొమాంటిక్ సాంగ్ మూవీ కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. తనికెళ్ల భరణి, సుహాసినీ పెయిర్ కూడా కథలో కీ రూల్ ప్లే చేసిందనే చెప్పాలి.

దర్శకుడు బాలరాజశేఖరుని ఓ మంచి సినిమా చేస్తాడనే నమ్మకం తో "హనీమూన్ ఎక్స్ ప్రెస్" సినిమాకు నాగార్జున, అమల, రాఘవేంద్రరావు, విజయేంద్రప్రసాద్, ఆర్జీవీ, అడివి శేష్, అవసరాల శ్రీనివాస్ వంటి  స్టార్స్ ప్రమోట్ చేశారు. వారి నమ్మకం ప్రేక్షకుల ఆదరణతో నిజమవడం పట్ల చిత్ర యూనిట్ ఆనందంగా ఉన్నారు.  "హనీమూన్ ఎక్స్ ప్రెస్" సినిమాను న్యూ రీల్ ఇండియా బ్యానర్ పై కేకేఆర్, బాలరాజ్ నిర్మించారు.నటీనటులు : చైతన్య రావు, హెబ్బా పటేల్, తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ, తదితరులు  నటించారు.

Also Read: Kodali nani: మాజీ మంత్రి కొడాలి నానికి మరో బిగ్ షాక్.. గుడివాడలో కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News