Bigg Boss: బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో బాయ్’ మూవీ నుంచి టైటిల్ సాంగ్ లాంఛ్..

Bigg Boss: బిగ్ బాస్ రియాల్టీ షోతో ఎంతో మంది యూట్యూబర్స్ తో పాటు సోషల్ మీడియా ఇన్ ఫ్యూయనర్స్  కు మంచి వేదికగా మారింది. అంతేకాదు ఈ షోలో పార్టిసిపేట్ చేసిన వారు హీరోలుగా, హీరోయిన్లుగా వెండితెరపై తమ లక్ పరీక్షించుకుంటున్నారు. ఈ కోవలో బిగ్ బాస్ 7 ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో బాయ్’ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదల చేసారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 25, 2024, 12:16 PM IST
Bigg Boss: బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా  ‘సోలో బాయ్’  మూవీ నుంచి టైటిల్ సాంగ్ లాంఛ్..

Bigg Boss: బిగ్ బాస్ షోతో ఎంతో మంది పాపులర్ అయ్యారు. అంతేకాదు ఇక యూట్యూబ్ మరియు ఇతర వేదికల్లో పాపులారిటీ సంపాదించిన వాళ్లే ఈ షోలో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ కోవలో బిగ్ బాస్ 7 రియాలిటీ షోలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో బాయ్’ సినిమా చేస్తున్నడు. తాజాగా సోలో బాయ్ టైటిల్ సాంగ్ లాంచ్ ఈవెంట్  ఘనంగా జరిగింది.  సోలో బాయ్ టైటిల్ సాంగ్ హుక్ స్టెప్ చాలెంజ్ నిర్వహిస్తున్నారు.  మొదటి బహుమతి 30,000, రెండవ బహుమతి 20000, మూడో బహుమతి 10000. బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ పై సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ నిర్మాతగా పి. నవీన్ కుమార్ డైరెక్షన్ లో వస్తోన్న మూవీ ‘సోలో బాయ్’. జుడా షాండి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి ఆట సందీప్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. కాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ సోలో బాయ్ టైటిల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా అనిత చౌదరి  మాట్లాడుతూ :
ఈ సినిమాలో గౌతమ్ కి తల్లి పాత్రలో చేస్తున్నాను. గౌతమ్ చాలా నెమ్మదస్తుడు.  అందరి గురించి  ఆలోచిస్తాడు. సెవెన్ హిల్స్ సతీష్ ఈ చిత్రాన్ని ఎంతో పాషన్ తో నిర్మించారు. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రపీ త్రిలోక్ అందించారు. ఈ సినిమా ప్రేక్షకుల ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు.

డైరెక్టర్ పి. నవీన్ కుమార్ గారు మాట్లాడుతూ :
నాకు  దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చిన సెవెన్ హిల్స్ సతీష్ కి ఎంతో రుణపడి ఉంటాను. మా హీరో గౌతమ్ కృష్ణ చాలా బాగా నటించాడు. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు.

ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్ కుమార్మాట్లాడుతూ :
ముందు నుంచి నన్ను సపోర్ట్ చేస్తున్న మీడియాకి ప్రత్యేక ధన్యవాదాలు. చిన్న సినిమా పెద్ద సినిమా లేకుండా మా సినిమాను ఆదిరిస్తోన్న మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సోలో బాయ్ సినిమా కూడా అలాగే ఒక మంచి సినిమా. ఈ సినిమా కోసం మాకు సపోర్ట్ చేసి కష్టపడి పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ కి టెక్నీషియన్ కి పేరు పేరునా ధన్యవాదాలు.

హీరోయిన్ శ్వేతా అవస్థి మాట్లాడుతూ : నాకు ఈ సినిమాలో హీరోయిన్  అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ సతీష్ కి డైరెక్టర్ నవీన్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. గౌతమ్ కృష్ణ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాడు. టైటిల్ సాంగ్ లో డాన్స్ ఎంతో ఈజ్ చేశాడు. ఈ సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందన్నారు.

హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ..  హుక్ స్టెప్ చాలెంజ్ చేసి మమ్మల్ని, టీం ని ట్యాగ్ చేసి పోస్ట్ చేసిన వాళ్ళ నుంచి బెస్ట్ వాళ్లను సెలెక్ట్ చేసి మీడియా ముందే బహుమతిని ఇస్తామన్నారు. నాలో ఉన్న డాన్సర్ ను బయటికి తీసుకొచ్చింది సందీప్ మాస్టర్. నీలో మంచి రిథమ్ ఉంది కొంచెం కష్టపడితే కచ్చితంగా మంచి డాన్సర్ అవుతానని చెప్పారు. టైటిల్ సాంగ్ కాసర్ల శ్యామ్  రాశారు. రాహుల్ సిప్లిగంజ్ అన్ అద్భుతంగా ఆలపించారు. ఇద్దరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా  సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ముందు ముందు టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మీ ముందుకు వస్తాము. అదేవిధంగా నెగటివ్ ట్రోల్స్ చేసే అందరికీ ఒక ఫ్రెండ్ లా చెప్తున్నాను. ముందు మీ కెరీర్ మీద దృష్టి పెట్టండి. నెగిటివ్ కామెంట్స్ నెగటివ్ ట్రోల్స్ ఆపాలని విన్నవించారు.

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News