గ్రీన్ వాల్ తో ఆహ్లాదం

          

Last Updated : Nov 15, 2017, 05:18 PM IST
గ్రీన్ వాల్ తో ఆహ్లాదం

ఇంటి పెరట్లో, బాల్కనీలో మొక్కలు పెంచడం ఇప్పటివరకూ చూసిందే. కానీ స్థలం లేనివారు గోడకు మొక్కలు పెంచి ఇంటికి పచ్చదనాన్ని తీసుకువస్తున్నారు. 

* మట్టి లేని చోట, మొక్కలు పెంచడానికి అనువైన స్థలం లేనిచోట ముఖ్యంగా అపార్టుమెంట్లలో గార్డెనింగ్‌ కోరుకునే వారు నిలువు (వర్టికల్) గార్డెన్ పెంచుతున్నారు. ఇలా చేయడం వల్ల  కార్బన్ డై ఆక్సైడ్ (CO2) బయటకు పోయి, స్వచ్ఛమైన ఆక్సిజన్ (O2) అందుతుంది.

* నిలువు గార్డెన్స్ ఏర్పాటు చేసుకోవడంలో మట్టి అవసరం లేదు. మాడ్యూల్స్‌ మధ్యన పెట్టే షీట్‌లో కాయర్‌ పిట్‌ని నింపుతారు. మొక్కలకు అవసరమైన ఎరువులను అందులోనే కలిపి పెంచుతారు. మొక్కలు అందులో ఏపుగా పెరుగుతాయి.

* అపార్టుమెంట్ ఉష్ణోగ్రత తగ్గించడంలో వర్టికల్‌ గార్డెన్స్‌ బాగా సహాయపడతాయి. ఇంట్లో కూడా ప్రశాంతతను అందిస్తాయి.

* గ్రీన్‌ వాల్‌కు డ్రిప్‌ ఇరిగేషన్‌ సిస్టమ్‌తో నీటి సరఫరా పెట్టుకోవచ్చు. నీళ్లు వృధా కావు.

Trending News