Weight Loss Home Drinks: మీరు కూడా బరువు తగ్గాలని ఎన్నో రోజులుగా ప్లాన్ చేస్తున్నారా? బరువు తగ్గడం సాధ్యం కావట్లేదా? అయితే ఈ నీటితో త్వరగా మీరు బరువు తగ్గొచ్చు. ఇంట్లోనే ఈ నీటిని తయారు చేసుకుని ఉదయం పరగడుపున తీసుకుంటే ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. ఇంట్లో తయారు చేసుకునే ఈ ప్రత్యేక నీటితో మీ శరీరానికి ఆరోగ్యం అంతే కాదు బరువు కూడా త్వరగా తగ్గిపోతారు. ఆ నీరు ఏంటో తెలుసుకుందాం.
లెమన్ వాటర్ తేనె..
నిమ్మకాయ నీరు మంచి ఆరోగ్యకరమైన పాణ్యం మనందరికీ తెలుసు. ఇది బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది ఇది నాచురల్ డిటాక్స్ డ్రింక్ మాదిరి పనిచేస్తుంది. అధిక శాతం ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుంది, కాబట్టి అతిగా తినకుండా ఉంటారు. అంతేకాదు ఇది రోజంతాటి కావాల్సిన హైడ్రేషన్ అందిస్తుంది .మెటబాలిజం రేటును కూడా పెంచుతుంది. దీంతో బరువు పెరగకుండా ఉంటారు. నిమ్మకాయ రసం తేనెతో కలిపి ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న విష పదార్థాలు కూడా బయటికి వెళ్లి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇందులో ఉండే తేనె నాచురల్ స్వీట్నర్.
దాల్చిన చెక్క తేనె టీ..
దాల్చిన చెక్కలో ఇది మన అందరికీ కిచెన్ లో అందుబాటులో ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి కూడా మ్యాజిక్ లాగా పని చేస్తుంది. దాల్చిన చెక్క నీటిని తేనెతో కలిపి టీ మాదిరి తయారు చేసుకొని తీసుకోవడం వల్ల ఇది యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ మైక్రోబియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. దీంతో బరువు పెరగకుండా ఉంటారు. అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసే వారికి ఈ టీ ఎంతో మంచిది. 2012 నివేదిక ప్రకారం దాల్చిన చెక్క తేనెటీ తీసుకోవడం వల్ల బరువు ఈజీగా తగ్గిన నివేదికలు ఆధారాలు ఉన్నాయి.
ఇదీ చదవండి: ఈ 5 ఆయుర్వేద హెయిర్ ఆయిల్ జుట్టును సహజసిద్ధంగా కుదుళ్ల నుంచి బలపరుస్తాయి..
పచ్చి వెల్లుల్లి..
పచ్చి వెల్లుల్లి కూడా మన కిచెన్ లో అందుబాటులో ఉండే వంటింటి పదార్థం. రుచి అరోమా బాగుంటుంది వెల్లుల్లితో కూడా బరువు సులభంగా తగ్గొచ్చు ఇందులో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్, మాంగనీస్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పరగడుపున పచ్చి వెల్లుల్లి తినడం వల్ల కూడా బెల్లీ ఫ్యాట్ బర్న్ అయిపోతుంది.
యోగర్ట్
బరువు తగ్గడానికి మలో మరో వంటింటి హోమ్ రెమిడి. యోగార్ట్ లో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఎన్నో నివేదికలు తెలిపాయి. అయితే యోగర్ట్ మెటబాలిజం రేటు పెంచుతుంది. యోగర్ట్‌లో ప్రోటీన్స్, మినరల్స్ , ప్రోబయోటిక్స్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది మంచి పేగు ఆరోగ్యానికి ప్రేరేపిస్తుంది.
ఇదీ చదవండి: ఇంట్లోనే తయారు చేసుకునే ఈ కండిషనర్ తో మీ జుట్టు పట్టులా మెరిసిపోతుంది..
చియా సీడ్స్..
చియా సీడ్స్ లో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్, పొటాషియం కూడా ఉంటుంది. చియా సీడ్స్ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. ముఖ్యంగా చియా సీడ్స్ లో కరిగే ఫైబర్ ఉంటుంది. మన శరీరంలో ఉన్న అధిక నీటిని కూడా గ్రహిస్తుంది. అంతే కాదు చియా సీడ్స్ డైట్లో చేర్చుకోవడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది చియా సీడ్స్ ఆరోగ్యకరమైన బరువు నిర్వహణకు కీలక పాత్ర పోషిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి