Pink Glow Skin: మీ ముఖంపై పింక్ గ్లోయింగ్ లుక్ రావాలంటే ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి..

Pink Glow Skin:  పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పార్టీలకు వెళ్లాలన్న పార్లర్ల బాట పట్టాల్సిందే. దీనికి వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అయితే, ఇంట్లోనే నేచురల్ గా ఈ ఫేస్ ప్యాక్ ను తయారుచేసుకోండి.. దీంతో మీకు ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉండవు.

Written by - Renuka Godugu | Last Updated : Mar 6, 2024, 01:37 PM IST
Pink Glow Skin: మీ ముఖంపై పింక్ గ్లోయింగ్ లుక్ రావాలంటే ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి..

Pink Glow Skin:  పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పార్టీలకు వెళ్లాలన్న పార్లర్ల బాట పట్టాల్సిందే. దీనికి వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అయితే, ఇంట్లోనే నేచురల్ గా ఈ ఫేస్ ప్యాక్ ను తయారుచేసుకోండి.. దీంతో మీకు ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉండవు. బీట్‌ రూట్‌ ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఎక్సర్‌సైజులు చేసిన తర్వాత కూడా స్టామినా కోసం ఈ జ్యూస్ తాగుతాం. దీంతో గుండె సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే, బీట్‌ రూట్ ను వివిధ రకాల సౌందర్య చిట్కాల్లో కూడా వాడతారు. దీంతో ఫేస్ మాస్క్, ప్యాక్, సీరం, లిప్‌బామ్ వంటివి తయారు చేసుకోవచ్చు. ఈరోజు మనం ముఖంపై పింక్ గ్లోయింగ్ లుక్ రావాలంటే బీట్‌రూట్‌ జ్యూస్ తో తయారుచేసే ఫేస్ ప్యాక్ గురించి తెలుసుకుందాం. దీంతో నేచురల్‌గానే మీ ముఖంపై పింక్ గ్లోయింగ్ లుక్ కనిపిస్తుంది.మనం చర్మ ఆరోగ్య కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. బీట్‌ రూట్ ఫేస్ మాస్క్ తో డెడ్ స్కిన్ సమస్యకు చెక్ పెట్టొచ్చు. కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. బీట్‌ రూట్ తో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

బీట్‌రూట్‌ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..
బియ్యంపిండి
బీట్‌రూట్‌ జ్యూస్
కలబంద

ఇదీ చదవండి: పొట్టను శుభ్రం చేసే 3 డ్రింక్స్.. కేవలం 10 రోజుల్లో బరువు కూడా తగ్గొచ్చు..!  
 
గులాబీ రంగు బుగ్గలు కావాలంటే బీట్‌ రూట్ బియ్యం పిండి ఫేస్ ప్యాక్ ను వేసుకోండి. బియ్యం పిండితో స్ర్కబ్ కూడా చేసుకోవచ్చు. బీట్‌ రూట్‌ జ్యూస్ కాస్త బియ్యం పిండి తీసుకుని ముందుగా ముఖం స్క్రబ్ చేసుకోవాలి. సున్నితంగా సర్క్యూలర్ మోషన్లో ముఖంపై రుద్దుకోవాలి. ఆరిన తర్వాత పేస్ వాష్ చేసుకోవాలి. బియ్యం పిండిలో ఎక్స్‌ఫోలియేట్ గుణాలు ఉంటాయి. దీన్ని ప్రతిరోజూ కూడా ప్యాక్ మాదిరి వేసుకోవచ్చు. బియ్యం పిండితో ప్యాక్ వేసుకుంటే ట్యాన్ తొలగిపోతుంది. ముఖం మృదువుగా మారుతుంది.

ఇదీ చదవండి:  ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టే గసగసాలు.. వీటి లాభాలు ఏంటో తెలుసుకోండి!  

ఆ తర్వాత ముఖంపై ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి ప్యాక్ ను సిద్ధం చేయాలి. దీనికి ముందుగా బియ్యం పిండిని ఓ బౌల్ లో తీసుకోవాలి. అందులో ప్యాక్ కు సరిపోయే జ్యూస్ కూడా వేసుకోవాలి. దీంట్లోనే తాజా కలబంద గుజ్జు లేదా మార్కెట్లో దొరికే కలబందను ఓ స్పూన్ వేసుకోవాలి. వీటన్నింటినీ ఫేస్ ప్యాక్ మాదిరి తయారుచేసుకోవాలి. ఓ 15 నిమిషాలపాటు ముఖం వేసుకుని ఆరిన తర్వాత సాధారణ నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకున్నా ముఖం గులాబీ రంగులో మెరిసిపోతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News