Mosquito Control: దోమల వల్ల ఇబ్బంది పడుతున్నారా ? అయితే ఇలా చేసి చూడండి!

 Mosquito Control | దోమ..అది కేవలం 0.125 నుంచి 0.75 ఇంచులు మాత్రమే ఉంటుంది. కానీ ఆరడుగుల ఆజానుబాహుడికి సైతం చుక్కలు చూపిస్తుంది. 

Last Updated : Oct 21, 2020, 10:58 PM IST
    • దోమ..అది కేవలం 0.125 నుంచి 0.75 ఇంచులు మాత్రమే ఉంటుంది.
    • కానీ ఆరడుగుల ఆజానుబాహుడికి సైతం చుక్కలు చూపిస్తుంది.
    • ఒక్క దోమ వల్ల రాత్రంతా ఇబ్బంది పడి ఉదయం పని చేయడానికి ఇబ్బంది పడే వారి సంఖ్య ఎక్కువే ఉంటుంది.
Mosquito Control: దోమల వల్ల ఇబ్బంది పడుతున్నారా ? అయితే ఇలా చేసి చూడండి!

Tips To Control Mosquitoes | దోమ..అది కేవలం 0.125 నుంచి 0.75 ఇంచులు మాత్రమే ఉంటుంది. కానీ ఆరడుగుల ఆజానుబాహుడికి సైతం చుక్కలు చూపిస్తుంది. ఒక్క దోమ ( Mosquito) వల్ల రాత్రంతా ఇబ్బంది పడి ఉదయం పని చేయడానికి ఇబ్బంది పడే వారి సంఖ్య ఎక్కువే ఉంటుంది.

దోమల నుంచి తప్పించుకోవడానికి మార్కెట్లో లభించే కాయిల్స్, పేపర్లు, బాడీ క్రీమ్స్ ఇలా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కొన్ని సార్లు ప్రయోజనం కనిపించదు. 

దోమ జీవిత కాలం 2 వారాల నుంచి 6 నెలలు ఉంటుంది. నీరు పోగైన ప్రాంతాల్లో దోమలు బెడద ఎక్కువగా ఉంటుంది. అందుకే నీరు ( Water ) పోగు కాకుండా చూసుకోవాలి. ఖాళీ టైర్లు, బకెట్లు, గుంటల్లో నీరు చేరుకుండా చూసుకోవాలి. చేరినా తొలిగించాలి. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా దోమలు పోవడం లేదా .. అయితే ఈ టిప్స్ పాటించండి. ఆరోగ్యాన్ని ( Health ) కాపాడుకోండి.

1.వెల్లుల్లి | Garlic
వెల్లుల్లి ఉన్న చోటు దోమలు ఉండవు. ఎందుకంటే వెల్లుల్లి ఘాటు వాసన దోమలకు పడవు. అందుకే వెల్లుల్లిని చిన్ని చిన్ని ముక్కలుగా చేసి దోమలు ఎక్కువగా ఉన్న చోటు పెడితే సరిపోతుంది. 

2. వేప | Neem
వేప ఆకులను వాడి కూడా దోమల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. దీని కోసం మీరు చేయాల్సిదల్లా ముందు వేప నూనె, కొబ్బరి నూనెను సమానంగా మిక్స్ చేసి ఆ లిక్విడ్ ను చర్మంపై అప్లై చేయండి. ఆ వాసనకు దోమలు రావు.

3. కర్పూరం | Karpoor
కర్పూర వాసనతో దోమలు పారిపోతాయి అని తెలిసిందే. అయితే బిర్యానీ ఆకులతో కలిపి కర్పూరాన్ని కాల్చితే ఆ వాసనకు దోమలు రావు.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News