Summer Eye Care Tips : సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. అంటే మన శరీరంలో ఉన్న అన్ని అవయవాలలో అన్నిటికంటే ముఖ్యమైనవి మన కళ్లు. అందుకే మన కళ్ళ ఆరోగ్యం మనం ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలి.
ఇక అసలే ఇది వేసవికాలం. అప్పుడప్పుడు ఈ వర్షాలు కొంచెం మనకి ఎండ వేడి నుండి ఊరటనిస్తున్నా కూడా వేడి వల్ల వచ్చే సమస్యలు మాత్రం. వస్తూనే ఉన్నాయి. అలాగే కళ్ళకి సంబంధించిన సమస్యలు కూడా వేసవిలో ఎక్కువగా ఉంటాయి. ఎండ వేడి వల్ల డీహైడ్రేషన్ కారణంగా కళ్ళు కూడా డ్రై అయిపోవడం, దురదలు రావడం, రెడ్ గా అయిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి.
సూర్య కిరణాలు డైరెక్ట్ గా కంటి మీద పడినా కూడా అవి కంటికి హాని కలిగిస్తాయి. ఈ సమస్యలను నివారించడం కోసం వేసవిలో ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండాలి. అంతే కాకుండా ప్రత్యేకంగా కళ్ల కోసం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఈ సమయంలో చాలా ముఖ్యం. దానికోసం ప్రత్యేకంగా ఏమీ కొనకపోయినా ఇంట్లో ఉండే వాటితోనే మనం కళ్ల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు.
ఉల్లిపాయలు:
ఉల్లిపాయలు వంటలో మాత్రమే కాకుండా ఆరోగ్యం మెరుగుపడటానికి కూడా బాగా ఉపయోగపడతాయి. ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల హీట్ స్ట్రోక్ నుంచి తప్పించుకోవడానికి ఉపయోగపడతాయి. అందుకే వేసవిలో ఉల్లిపాయలు ఎక్కువగా తినాలని నిపుణులు కూడా సూచిస్తున్నారు.
సన్ గ్లాసెస్:
ఇంతకుముందు వరకు సన్ గ్లాసెస్ స్టైల్ గా వాడేవాళ్ళు కానీ ఇప్పుడు ఉన్న ఎండలకి అది నిత్యసవర వస్తువు అయిపోయింది అంటే అతిశయోక్తి కాదు. బయటకి వెళ్ళేటప్పుడు UVA, UVB కిరణాల నుండి రక్షణ కోసం కళ్ళను పూర్తిగా కప్పి ఉంచే సన్ గ్లాసెస్ ను కచ్చితంగా ధరించాలి. కార్నియాకు సూర్యుని హానికరమైన కిరణాలు తగలడం అసలు మంచిది కాదు. వేసవిలో నీడలోనే ఉండడం చాలా బెటర్. కానీ బయటకు వెళ్లాల్సి వస్తే సన్ గ్లాసెస్, పాటు గొడుగు తీసుకు వెళ్ళడం మరవద్దు.
ఐ డ్రాప్స్:
వేసవిలో ఆకాశాన్ని తాకుతున్న ఉష్ణోగ్రత, వేడి తరంగాల వల్ల కళ్లు పొడిబారిపోతాయి. ముఖ్యంగా కంప్యూటర్లు ల్యాప్‌టాప్‌లలో పనిచేసే వాళ్ళు కూడా ఈ సమస్యతో బాధపడతారు. అందుకే సమ్మర్ లో లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ వాడడం మంచిది.
నీళ్లు:
ఆఖరిగా వేసవిలో అన్నిటికంటే ముఖ్యంగా మనకి కావాల్సింది శరీరానికి సరిపడా మంచినీళ్లు. చర్మంతో పాటు కళ్లను హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం కోసం నీళ్లు తాగడం తో పాటు అప్పుడప్పుడు శుభ్రమైన నీటితో కళ్లను శుభ్రంగా కడగడం కూడా మంచిదే. పుచ్చకాయ, జమ్రుల్, తల్షన్స్ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు ఎక్కువగా తినాలి.
Also read: Cyclonic low Depression: బంగాళాఖాతంలో అల్పపీడన హెచ్చరిక, ఏపీలో అతి భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook